దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ పై ప్రజల నుంచి పోలీసులకు జేజేలు లభిస్తున్నాయి. దీనిపై దిశ కుటుంబం స్పందించింది. ఇంత త్వరగా న్యాయం జరుగుతుందని తాము ఊహించలేని దిశ తల్లి చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ తోనైనా.. దిశ ఆత్మకు కాస్త శాంతి దొరుకుతుందని దిశ తల్లి అన్నారు. కానీ ఇలా ఎన్ కౌంటర్ చేస్తారని ఊహించలేదన్నారు.

 

ఇక దిశ చెల్లి స్పందిస్తూ.. ఈ ఘటనలో తాము ఊరి శిక్ష పడుతుందని.. వారిని త్వరగా ఉరి తీస్తారని అనుకున్నాం.. ఈ ఎన్ కౌంటర్ తోనైనా ఓ మార్పు రావాలని కోరుకుంటున్నా అన్నారు. ఇంకా దిశ లాంటి ఘటనలు రిపీట్ కాకూడదని ఆశించారు. ఇది ఒక గుణపాఠంగా ఉంటుందన్నారు. అయితే తాము ఎన్ కౌంటర్ చేస్తామని ఊహించలేదన్నారు.

 

ఇక ఈ ఎన్‌ కౌంటర్ ఘటనపై జనం కూడా జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే ఈ ఎన్ కౌంటర్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ స్థలంలో పోలీస్ జిందాబాంద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ విషయంలో చట్టం పరిస్థితి ఎలా ఉన్నా.. దిశ కేసులో సత్వర న్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారు.

 

గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చాయి. నిందితుల విచారణ సమయమలో ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు నిందితులను తమకు అప్పగించాలని నిరసన చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి దిశను కాల్చిన చోటే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే ఈ ఎన్ కౌంటర్ పై మేథావులు, న్యాయ నిపుణులు ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: