నిర్భయ కేసులో ఇంకా న్యాయం జరగకముందే , పశు వైద్యురాలు దిశ హత్యచార ఘటనకు పోలీసులు ఎన్ కౌంటర్ తో  పోలీసులు ముగింపు పలికారు . ఢిల్లీ లో నిర్భయ  హత్యాచార ఘటన  నిందితులు ఇప్పటికీ  జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే . దిశ కేసులోనూ నిందితులకు శిక్ష పడేందుకు సుదీర్ఘకాలం పడుతుందని అందరూ భావిస్తున్న తరుణం లో తెలంగాణ పోలీసులు , దిశ ను హత్యచారం చేసిన స్థలం లో సీన్ కన్ స్ట్రక్చన్ చేస్తుండగా పారిపోయే యత్నం చేసిన నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది .

 

అయితే పోలీసులు ఈ విషయాన్ని ప్రస్తుతానికైతే అధికారికంగా ప్రకటించలేదు . దిశ హత్యాచార ఘటన పై దేశవ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలు పెల్లుబికిన విషయం తెల్సిందే . నిందితుల్ని బహిరంగంగా ఉరి తీయాలని లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని సాధారణ ప్రజలను మొదలుకుని ప్రముఖులు డిమాండ్ చేశారు . ఇక నిందితుల్ని జైలు కు తరలించే సమయం లో షాద్ నగర్ పోలీసు స్టేషన్ పై స్థానికులు దాడిచేసినంత పని చేశారు . పోలీసులు అదనపు బలగాలను మోహరించి  నిందితులకు రక్షణ కల్పించారు . ఇక పోలీసుల వైఖరిపై ఆగ్రహించిన సామాన్యులు స్టేషన్ పైకి రాళ్లు, చెప్పులతో విసిరి తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు . దిశ హత్యచార నిందితుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తర్వగా శిక్ష పడేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన ప్రజల్లో నిరసనలు తగ్గలేదు.

 

రెండు రోజుల క్రితం నిందితుల్ని కోర్టు పోలీసు కస్టడీకి  అప్పగించగా వారిని సైబరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు . హత్యాచార ఘటన లో నిందితు లు చెబుతున్న విషయాలు ఆడపిల్లల తల్లితండ్రులను ఆందోళనకు గురిచేస్తోన్న సమయం లో , పోలీసులు వారిని ఎన్ కౌంటర్ లో హతం చేశారన్న విషయాన్ని తెలుసుకుని హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: