సమాజంలో రెండు వర్గాలు ఉంటాయి. ఒక పనిని పోగిడే వారుంటే, అదే పనిని విమర్శించే వారుంటారు. కాని ఇప్పుడు జరిగిన దిశ సంఘటనలో జరిగిన మంచిపని ఏమిటంటే నిందితుల్ని ఎక్కువ కాలం విచారణ పేరుతో కాలయాపన చేయకుండా జీవితం విలువ తెలిసేలా జైళ్లో రుచి చూపించి ఒక్కసారిగా అనంతలోకాలకు పంపించారు.

 

 

ఈ విషయంలో అనవసర రాద్దాంతం అవసరం లేదు. ఒక మంచిపని కోసం పదిమంది చెడ్డవారిని చంపైనా మంచిని బ్రతికించు అని సినిమాలో డైలాగులు వస్తే చప్పట్లు కొట్టి ఎంతగానో ఫీలవుతాం. అలాంటిది, జాలి, దయ, కరుణ అనేది లేకుండా కనీసం నా తల్లి కూడ ఆడదే. మేము కూడా ఆడదానికే పుట్టాము అనే ఆలోచనే లేకుండా అత్యంత కౄరంగా హింసించి చంపిన ఈ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం అసలు తప్పే కాదు అని నీతిగా బ్రతికే ప్రతి వారు ఆవేశంగా నినాదాలు చేస్తున్నారు. ఇలా కొంతకాలం చేసుకుంటు వెళ్లితే ఆడపిల్లల వంక తలెత్తి చూడాలన్న ఆలోచనే చచ్చిపోతుందని ప్రతి వారు కోరుకుంటున్నారట.

 

 

ఇంతే కాకుండా ఇది ఒక్కరి ఆలోచన కాదట. ప్రతి ఆడపిల్లను కన్న తల్లిదండ్రుల ఆలోచనట. ఎందుకంటే ఆడపిల్లను కన్న తల్లి దండ్రుల్లో ఇలాంటి సంఘటనల వల్ల ఇప్పటికే భయం చోటు చేసుకుంది. ఇకముందు ఆడపిల్లలను కనాలంటే తెలియని భయం చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్దితుల్లో కామాంధుల పట్ల దయ చూపకుండా తెలంగాణ పోలీసులు చేసిన  పనిని ఎవరు విమర్శించడానికి వీలు లేదు.

 

 

ఆ నీచులను కన్న తల్లిదండ్రులే మాకు ఈ పిల్లలు వద్దను కున్నప్పుడు సమాజంలో ఉన్న మనమెంత వారి చావుని ఆపడానికి. కాబట్టి న్యాయానికి అన్యాయం జరుగలేదని సంతృప్తి పడుదాం. ఇకపోతే నిందితుల్ని చంపడం వల్ల పోయిన దిశ తిరిగిరాదు. కాని ఇలాంటి దరిద్రపు పని చేయాలంటే సమాజంలో ఉన్న మృగాళ్లకు ఒంట్లో భయం పుడితే అదే చాలు. మరో ఆడపిల్ల జీవితం ఇలా కాకుండా రక్షించబడితే దిశ ఆత్మకు శాంతి కలిగినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: