దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్ కౌంటర్ ద్వారా  తెలంగాణ పోలీసులు, అత్యాచార ఘటనల నిందితులకు , అత్యాచారాలకు  పాల్పడాలనుకునే వారికి స్పష్టమైన సంకేతాలను పంపినట్లయింది . గతం లో వైఎస్ ప్రభుత్వం హయాం లో  వరంగల్ లో అత్యాచార ఘటన నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసినట్లుగానే , ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం కూడా నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి . నిన్నటి వరకూ దిశ హత్యచార ఘటన పై ఆలస్యంగా స్పందించడమే కాకుండా , ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని కేసీఆర్ ని విమర్శిస్తూ వచ్చిన నెటిజన్లు , నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు .

 

 ఈ తరహా నిర్ణయాన్నే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే , దేశం లో అత్యాచార ఘటనలకు అస్కారమే ఉండే అవకాశాలు లేవంటున్న నెటిజన్లు , కేసీఆర్ లాంటి నాయకుడు , సజ్జనార్ లాంటి పోలీసు అధికారి ఉండాలని కోరుకుంటున్నారు . ఇక పోలీసుల కస్టడీ నుంచి నిందితులు పారిపోయే అవకాశమే లేదని , అయినా ఎన్ కౌంటర్ ను మాత్రం సమర్ధిస్తున్నానని మరొక వ్యక్తి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు . ఇక దిశ తల్లితందులు నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం వ్యక్తం చేస్తూ , నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని, అయితే  ఎన్ కౌంటర్ ద్వారా అంతకుమించి శిక్ష పోలీసులు విధించారని అన్నారు . నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారన్న వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించలేకుండా ఉండలేకపోతున్నారు .

 

 నిందితులకు సరైన శిక్షనే విధించారని ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానించడం కన్పిస్తోంది . దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసినట్లుగానే , వరంగల్ లో అదే రోజు అత్యాచారానికి గురై హత్య కావింపబడిన మానస కేసులో నిందితునికి ఎటువంటి శిక్ష విధిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది .

మరింత సమాచారం తెలుసుకోండి: