దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతం కీలక మలుపు తీసుకుంది. నిందితులు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవాలని చూడటంతో పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసేశారు. దేశాన్ని కుదేపిసిన ఈ ఉదంతంపై ఎంతటి ఆందోళనలు జరిగాయో తెలిసిందే. ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ తో నలుగురు ప్రాణాలు పోయాయి. ఈ ఘటనతో ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

 

 

ఈ నలుగురు నిందితులు కూడా నేర స్వభావం ఉన్నవారా, సైకో మనస్తత్వం ఉన్నవారా, చిన్నప్పటి నుంచి వారు పెరిగిన నేపథ్యం ఏంటి.. అనే ప్రశ్నలు పోలీసు కస్టడీలో బయటకు రావాల్సిన అంశాలు. కానీ అవేమీ జరుగలేదు. ఈ ఎన్ కౌంటర్ ప్రజలందరిలో ప్రశ్నలు ఉదయించేలా చేస్తోంది. పిల్లలను ఎలా పెంచాలి, యుక్త వయసు వచ్చాక వారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఎలాంటి సమాజంలో ఉంటున్నారు, వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు, స్నేహాలు ఎలాంటివి.. అనే అంశాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని వారిని మేల్కొలిపినట్టయింది. ఈ నలుగురు నిందితులు ముప్పై ఏళ్ల లోపు వారే అని తీసుకోవటానికి లేదు. దేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఉదంతాల్లో కదువా ఉదంతం కూడా ఉంది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారిని చిదేమేసిన నిందితుల్లో యాభయ్యేళ్ల వ్యక్తి కూడా ఉన్నాడంటే ఆశ్చర్యం వేయకమానదు. అంటే మారుతున్న వ్యవస్థల్లో ప్రజల తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేదానికి ఈ ఘటనలు నిదర్శనం.

 

 

పిల్లలను ముద్దు చేస్తూ పెంచుతారు తల్లిదండ్రులు. కానీ అదే గారం పెరిగే వయసులో చూపకూడదంటారు మానసిక నిపుణులు. ఇటువంటి ఘటనలే కాదు.. తల్లిదండ్రులకు తెలీకుండా సమాజంపై ప్రభావం చూపే ఏ పని చేసినా దానిని గుర్తించాల్పింది తల్లిదండ్రులే. బాధ్యతతో కూడిన జీవనం గురించి ఇంట్లో, స్కూల్లో, కాలేజీల్లో వారికి తెలిసేలా ఉండాలి. సమాజం గురించి సరైన అవగాహన కలిగితేనే ఇటువంటి దురాగతాలు ఆగే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: