దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో అభినందన వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది.

 

సెలబ్రెటీలు మొదలుకుని.. సామాన్యుల వరకూ దిశకు సత్వరమే న్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఆ మేరకు పోస్టులు పెడుతున్నారు. గతంలో వరంగల్‌లో యాసిడ్‌ దాడి నిందితులనూ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ వరంగల్‌ ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ఇప్పుడు దిశ హత్యాచార ఘటన సమయంలోనూ ఆయనే సీపీగా ఉండటం విశేషం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సజ్జనార్ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 

ఈ ఎన్‌కౌంటర్‌తో సమాజంలో కీచకుల దాడికి బలైన వారికి సత్వర న్యాయం చేస్తారన్న భరోసా ఇచ్చారంటోంది మహిళాలోకం. సజ్జనార్ ఈజ్ రియల్‌ లైఫ్‌ సింగం అంటూ పోస్టులు పెడుతున్నారు. నేరస్థులకు ఎన్‌కౌంటర్‌ ద్వారా తగిన గుణపాఠం చెప్పే పోలీస్‌ అధికారి తెలంగాణలో ఉన్నందుకు గర్వంగా ఉందని మరికొందరు కామెంట్ చేశారు.

 

ఇక దిశ రేపిస్టులు మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దిశ కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్ స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నిందితులు పారి పోయేందుకు ప్రయత్నించారని.. అందుకే వారిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించినందు వల్ల ఎన్ కౌంటర్ చేసినట్టు పోలీసులు చెబుతున్నట్టు తెలుస్తోంది. గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: