ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యింది.  అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్న ఈ పార్టీని ప్రతిష్ట పరిచేందుకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.  ఈ నేనపథ్యంలో ఆయనకు తోడుగా కుమారుడు నారా లోకేశ్ సైతం ముందు ఉంటున్న విషయం తెలిసిందే.  తాజాగా  గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌ల ప‌రిధిలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణిలు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో గురువారం కార్యాలయం ఆవరణలో ముందుగా గణపతి పూజ చేశారు.

 

అనంతరం సుదర్శన హోమం, గణపతి హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇకనుంచి తెలంగాణకే పరిమితం కానుంది. ఏపీ కార్యాలయానికి కూడాఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని నామకరణం చేశారు. ఇందులో మూడు బ్లాక్‌ల నిర్మాణానికి గాను మొదటి బ్లాక్‌ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన రెండు బ్లాకులకు నిర్మాణం పూర్తికాలేదు. కాగా,  కార్యాల‌యం ఆవర‌ణ‌లో ముందుగా గ‌ణ‌ప‌తి పూజ చేశారు. అనంత‌రం సుద‌ర్శ‌న హోమం, గ‌ణ‌ప‌తి హోమం భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించారు. వేద‌పండితుల స‌మ‌క్షంలో పూర్ణాహుతి కార్య‌క్ర‌మం పూర్తి చేశారు.

 

ఇక మొత్తం 75వేల అడుగులతో జీప్లస్‌-3గా మొదటి బ్లాక్‌ నిర్మాణం ఉంది. మూడో అంతస్తులో చంద్రబాబు, లోకేష్‌ ఛాంబర్స్‌ ఉండగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మీడియా,  రాష్ట్ర అధ్యక్షుడికి ఛాంబర్‌ రూమ్‌లు కేటాయించారు. కాగా.. శుక్రవారం ఉదయం 10 గంటల 03 నిమిషాలకు టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభంకానుంది. మూడు అంతస్థులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు.  ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: