దిశ రేపిస్టులను ఎన్ కౌంటర్ చేసిన ప్రాంతం జన జాతరగా మారింది. ఉదయం లేస్తూనే టీవీల్లో బ్రేకింగుల మీద బ్రేకింగులతో దిశ రేపిస్టులు ఎన్ కౌంటర్ గురించి తెలుసుకున్న శంషా బాద్ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఎన్ కౌంటర్ ప్రాంతానికి చేరుకుంటున్నారు. దిశను కాల్చిన చోటుకు దగ్గర్లోనే ఎన్ కౌంటర్ చేయడంతో.. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు బారులు తీరారు.

 

ఇప్పుడు దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ ప్రాంతం జనంతో కిటకిటలాడుతోంది. అక్కడకు చేరుకున్న జనం.. జైజై పోలీస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జైజై సజ్జనార్.. జైజై హైదరాబాద్ పోలీస్ అంటూ ఉద్వేగ భరితంగా నినాదాలు చేస్తున్నారు. దిశను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన నీచులను అతి తక్కువ సమయంలోనే ఎన్ కౌంటర్ చేయడం ప్రజలకు సంతోషాన్ని కలుగ చేస్తోంది.

 

దిశ రేప్ అండ్ మర్డర్ విషయం తెలిసిన తర్వాత నిందితులను తమకు అప్పగించాలంటూ ఆరోజు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా జనం తండోపతండాలుగా కుమి కూడారు. నిందితులను తమకు అప్పగిస్తే తాము శిక్షిస్తామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎన్ కౌంటర్ తో వారు హైదరాబాద్ పోలీసుల తీరుపై ప్రశంసల కురిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ ప్రాంతం, చటాన్ పల్లి వంతెన.. జనం తో కిటకిటలాడుతున్నాయి.

 

గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చాయి. రేపిస్టులు మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను పోలీసులు శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ చేశారు. తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దిశ కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే వారిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: