ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశాన్ని కలచివేసిన దిశ అత్యాచార ఘటన తో ప్రపంచ స్థాయిలో భారతదేశం పై భారతీయ చట్టాల పై అనేక విమర్శలు రావడం జరిగాయి. ముఖ్యంగా అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన నిందితులను చట్టాలు జైల్లో పెట్టి మేపటం సరైన పద్ధతి కాదని దిశ అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులను జైల్లో పెట్టిన సందర్భంలో సోషల్ మీడియాలో అలాగే చాలా పబ్లిక్ గా కూడా అనేక విమర్శలు రావడం జరిగాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా దిశ అత్యాచారానికి సంబంధించి నిందితులను ఇటీవల పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో చాలామంది సరైన న్యాయం ఇప్పుడే జరిగిందని దిశ ఆత్మకు శాంతి చేకూరిందని సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో దిశ వంటి ఘటన మరొకటి సమాజంలో జరగకుండా ఉండాలంటే ఇంటిలో ఉన్న మగ పిల్లలకు సాటి ఆడవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలో అన్న విషయాల గురించి ఇంటిలో ఉన్న పెద్దలు సరైన రీతిలో వారికి చెప్పాలని చాలా మంది కోరుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ అందుబాటులో రావటంతో బంధాలకు బాంధవ్యాలకు విలువ తగ్గిపోయి భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ శరీరం ఏది చెబితే అది చేసే విధంగా ప్రస్తుత యువతరం నడుస్తున్న నేపథ్యంలో...ప్రతి మగవాడికి సాటి ఆడవాళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అన్నదానిపై పెద్దలే చొరవ తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు.

 

ఇంటిలో తల్లిని చెల్లిని ఏ విధంగా భావించడం జరుగుతుందో అదేవిధంగా.. ఇంటి నుండి బయట సమాజంలో కి వెళ్ళినప్పుడు అదే రీతిలో ఉండాలని పెద్దలు…. ఇంటిలో ఉన్న యువకులకు తెలియజేయాలని చాలామంది సామాజికవేత్తలు కోరుకుంటున్నారు. వాళ్లు ఇష్టానుసారంగా బయట సమాజంలో తోటి ఆడవారి పట్ల ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఇంటిలోనే మరొకరు ఎన్ కౌంటర్ అయ్యే పరిస్థితి ఉండవచ్చని కచ్ఛితంగా ప్రస్తుత సమాజంలో స్త్రీ జాతి ఉండాలంటే…. ఇంటిలో ఉన్న యువకులకు సాటి ఆడవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలో అన్న దాని విషయంలో పెద్దలు ఎక్కువ చొరవ తీసుకోవాలని చాలా మంది సామాజిక వేత్తలు కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: