కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లోని షాద్ నగర్ వద్ద గల తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతంలో ఎంతో కిరాతకంగా డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు నిందితులు రేప్ చేయడం తో పాటు, ఆ తరువాత ఎంతో దారుణంగా ఆమెను చంపేసి, ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. కాగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర నిరసనను తెలియచేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై పలువురు ప్రజా, మహిళా సంఘాలతో పాటు గా సినిమా మరియు రాజకీయ ప్రముఖులు సైతం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నేరస్థులను ఘోరాతి ఘోరంగా ఉరి తీసి చంపాలని కొద్దిరోజలుగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. 

 

ఇక ఈ దారుణ ఘటన జరిగి పదిరోజులు పూర్తి కాకుండానే నిందితులు నలుగురిని నేటి తెల్లవారుఝామున, సరిగ్గా వారు ప్రియాంకను దగ్ధం చేసిన చోటనే పోలీసులు ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే, ముందుగా నేటి తెల్లవారుఝామున హత్య సీన్ రి కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రియాంకను కాల్చి దగ్ధం చేసిన ప్రదేశానికి ఆ నలుగురిని తీసుకువచ్చిఆ పోలీసులు, వారితో మాట్లాడుతూ విచారణ జరుపుతుండగా, సడన్ గా తమ వద్దనున్న తుపాకులు తీసుకుని నిందితులు పారిపోబోయారని, అందుకే ఆ సమయంలో వారిని ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందని సైబరాబాద్ ఎస్పీ సజ్జనార్ చెప్తున్నారు. కాగా వారి ఎన్కౌంటర్ వార్త బయటకు రాగానే, సర్వత్రా పోలీసులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

 

ఈ దారుణం జరిగి పది రోజులు కాకముందే ఈ విధంగా వారిని కుక్కల్ని కాల్చి నట్లు కాల్చి చంపడం సరైనదని, ఈ విధంగా చేయడం వలన ఇకపై అటువంటి తప్పుడు పనులు చేయదలచిన వారికి ఇది చెంపపెట్టుగా ఉంటుందని పలువురు ప్రజలు అంటున్నారు. ఇక నిందితుల ఎన్కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ గారికి కూడా వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఆయన పర్యవేక్షణలో ప్రియాంక ఆత్మకు నిజంగా శాంతి చేకూరిందని, అలానే ఈ ఘటనతో రాబోయే భవిష్యత్తులో ఇటువంటివి చాలా వరకు రిపీట్ కావని వారు భావిస్తూ, తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: