ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ ప్రాంతంలో ఘోరంగా రేప్ చేయబడి, ఆ తరువాత మర్దర్ అయిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనలో నిందితులను నేడు తెల్లవారుఝామున పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపారు. ఈ ఘోర ఘటనకు కారణమైన నలుగురు నిందితులను కూడా సీన్ రి కన్స్ట్రక్షన్ కోసం నేడు తెల్లవారుఝామున దిశాను వారు హత్య చేసిన ప్రాంతానికి తీసుకువచ్చిన పొలిసులు, వారిని ప్రశ్నిస్తుండగా, హఠాత్తుగా వారు పోలీసులను నెట్టేసి తుపాకులు లాక్కుని పారిపోవడానికి యత్నిస్తుండగా వెంటనే అప్రమత్తమైన మిగతా పోలీసులు, వారిని స్పాట్ లో అక్కడికక్కడే కాల్చివేయడం జరిగింది. ఇక ఆ నలుగురు నీచులు కూడా స్పాట్ లోనే చనిపోయినట్లు సైబరాబాద్ ఎస్పీ సజ్జనార్ తెలిపారు. 

 

అయితే నిందితులు నలుగురు కూడా పొలిసు విచారణ సమయంలో తాము చేసిన తప్పును ఒప్పుకోక పోగా, జరిగిన దారుణాన్ని చాలా సాదాసీదాగా తీసుకుని చెప్పడం, అలానే ఆ దారుణ ఘటనపై ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం చేశారట. గత నెల 27వ తేదీన ఈ ఘటన జరుగగా, నేడు 6వ తేదీన అనగా 10 రోజుల్లో నిందితులు ఈ విధంగా ఎన్కౌంటర్ రూపంలో హతం కావడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు ప్రజలు. ఇక ఈ ఎన్కౌంటర్ మ్యాటర్ బయటకు రావడంతో దేశవ్యాప్తంగా హర్షద్వానాలు మిన్నంటాయి. అసలు ఇటువంటి ఘటనలు ఇకపై జరుగకూడదంటే, ముందుగా మన మగ్గాబిడ్డలకు చిన్నప్పటినుండి ఆడవారి పట్ల ఎలా మెలగాలి, అలానే తల్లి, చెల్లి, భార్య వంటి వారి గురించి చిన్నప్పటినుండి వారికి తెలియచెప్పాలని అంటున్నారు మానసిక నిపుణులు. ఇక పరాయి స్త్రీని సోదరిలా భావించాలని, 

 

మన ఇంట్లోని ఆడబిడ్డల మాదిరిగానే మిగతా ఫ్యామిలీల్లో కూడా అమ్మాయిలు ఉంటారు, వారికి మనం విలువనివ్వాలి అనే విషయాలు కూడా నేర్పాలి అని అంటున్నారు మానసిక నిపుణులు. ఇటువంటివి ప్రతి ఒక్క మగ బిడ్డ తల్లితండ్రులు కూడా చిన్నప్పటి నుండి వారికి నేర్పడం వలన, కొంత వయసు వచ్చాక వారిలో ఆడవారిపట్ల తప్పకుండా గౌరవం పెరుగుతుందని అంటున్నారు. అలానే ఇటువంటి ఘటనలకు యువత మద్యానికి అలవాటుపడడం కూడా ఒక కారణం అని, కాబట్టి వారికి మద్యం మహమ్మారిని కూడా అలవాటు కాకుండా చూడాలని, ఎందుకంటే మద్యం మత్తులో తన, పర అనే దానికి తేడా తెలియదని, కావున బిడ్డలకు చిన్నప్పటి నుండే మద్యం వలన కలిగే నష్టాలు, అది ఎంత మహమ్మారి అనే విషయాలను నేర్పాలని కూడా సూచిస్తున్నారు. కావున ఈ విధంగా మనం కూడా మన మగ బిడ్డలను స్త్రీలకు గౌరవం ఇచ్చేలా పెంచుదాం, మన ఆడబిడ్డలను మనమే కాపాడుకుని మానవత్వాన్ని చాటుదాం....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: