రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దిశ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ దారుణ హత్య ఘటనలో నిందితులు ఈరోజు ఉదయం 3.30 గంటలకు ఎన్ కౌంటర్ కు గురయ్యారు. దిశ ఘటన ఎక్కడ జరిగిందో అదే ప్రాంతంలో నిందితులు ఎన్ కౌంటర్ కు గురి కావడం గమనార్హం. పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉండగా పోలీసులపై నిందితులు దాడి చేసి పారిపోయారు. 
 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దేశవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు పోలీసులను ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేయటమే సరైన చర్య అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యల ఘటనల్లో ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ ఉండటం అభినందించదగిన విషయం. 
 
దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలలో మార్పులు తీసుకొనిరావటానికి ప్రయత్నిస్తున్నాయి. దిశ ఘటనలో నిందితులైన మృగాళ్లను ఎన్ కౌంటర్ చేయడం మంచి నిర్ణయమని ఇలాంటి ఘటనలు ఇకనైనా పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమాజానికి ఒక మంచి ఉదాహరణ అని రేపిస్టులు నేరం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని ఎన్ కౌంటర్ లో చనిపోతామేమో అన్న భయం నేరస్థుల్లో ఉంటుందని తృప్తి దేశాయ్ అభిప్రాయపడ్దారు. 

 
దిశ లాంటి ఘటనలు జరుగుతాయని ఇకనుండి అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. దిశ తండ్రి మాట్లాడుతూ ఎన్ కౌంటర్ ఒక మంచి నిర్ణయం అని చెప్పారు. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరగడం సంతోషంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ప్రముఖులు, రాజకీయ నేతలు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం సమర్థనీయమే అని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: