దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిషా సంఘటనపై యావత్ భారత దేశంలోని ప్రజలు కట్టలు తెంచుకే ఆవేశంతో రగిలిపోతున్నారు. రేప్ చేసిన వాళ్ళని వెంటనే ఉరి తీయకుండా జైల్లో పెట్టి మేపడం ఏంటని ప్రజలందరు గొంతు చించుకొని అటు పోలీసులను, ఇటు ప్రభూత్వాన్ని నిలదీశారు. ఇక టాలీవుడ్ లో పలువు స్పందించిన సంగతి తెలిసిందే. మెగాస్టర్ స్పందిస్తూ ఇలాంటి వారిని నడి రోడ్డుమీదే ఉరి తీయాలి ఆవేదన వ్యక్తం చెరశారు. అయినా గత మూడు రోజులుగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్న ప్రభూత్వ వైఖరిని ప్రజలు తీవ్రంగా విమర్శించారు. అయితే అందరు అనుకున్నట్టుగా ప్రభూత్వం నిమ్మకి నీరెక్కినట్టుగా ప్రవర్తించలేదు. దిశ కు తగిన న్యాయం చేయడానికి ప్రణాళిక సిద్దం చేశారు. అందుకే ఏ ఒక్కరు ఊహించని విధంగా దిశ కు న్యాయం చేశారు. 

 

'దిశ' నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను ఈ గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 

 

విచారణలో భాగంగా .... దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను  పోలీసులు వెల్లడించ కుండా సీక్రెట్ గా ఉంచారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'దిశ' ఘటనలో జరిగిన న్యాయమే మిగతా ఆడపిల్లలకి చేయాలని ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో ప్రజలందరు ఆనందంతో అభినందనలు తెలుపుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: