దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న త‌రుణంలో...ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలో...దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. 

 

గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి, నిందితుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ను ఏర్పాటు చేయడంతో పాటు..ఏడురోజుల కష్టడీకి అనుమతించింది. తొలిరోజుల కష్టడీలో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. కనపించడకుండా పోయిన దిశా ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిశాఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ..సజీవ దహనం చేసిన చటాన్ పల్లి బ్రిడ్జీ వద్దకు నిందితుల్ని పోలీసులు తీసుకెళ్లారు. అర్ధరాత్రి అవ్వడంతో నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. 

 

వేగంగా విచార‌ణ చేసే త‌రుణంలో సీన్ రీ క‌న్ స్ట్ర‌క్ష‌న్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే సంబంధించి కేసును పగలు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రయత్నిస్తే నిందితుల్ని ప్రజలే కొట్టిచంపేస్తారని అనుమానంతో పోలీసులు అర్ధరాత్రి రీకనస్టక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా పోలీసులు అర్ధరాత్రి నిందితుల్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సీన్ రీకనస్ట్రక్షన్ జరుగుతుండగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులపై ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిన‌ట్లు స‌మాచారం. నిందితులకు ఆ ప్రాంతం సుప‌రిచిత‌మైనందువ‌ల్ల‌, అక్క‌డి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం వ‌ల్లే ఎన్‌కౌంట‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అధికారికంగా పోలీసులు చేసే ప్ర‌క‌ట‌న‌తో స్ప‌ష్ట‌త రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: