రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు భారత దేశం యావత్తూ 'దిశ' హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంలో తీవ్రమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి వీలైనంత త్వరగా నిందితులకి మరణశిక్ష విధించడం లేదా రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలని విపరీతమైన డిమాండ్లు వచ్చాయి. అయితే ప్రభుత్వానికి మరియు న్యాయస్థానానికి అంటూ కొన్ని చట్టాలు ఉండటంతో వారు కూడా ఈ పని త్వరగా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే బయట నుండి ఒత్తిడి చాలా ఎక్కువ కావడంతో వారందరినీ ట్రయల్ కోసం కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు.


ఇదే సమయంలో నిందితులకు కూడా తాము మరో రెండు రోజుల్లో కోర్టులో హాజరు కాబోతున్నామని అర్థమైంది. అక్కడ వారి తరుపున వాదించే న్యాయవాది లేడు... ఆధారాలు అన్నీ వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. కనీసం కన్న తల్లిదండ్రులు కూడా వారిని ఛీ కొట్టిన నేపథ్యంలో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదే సమయంలో పోలీసులు జనం ఎక్కువగా ఉండరని అర్ధరాత్రి వారిని ఘటనాస్థలానికి తీసుకెళ్లి మొత్తం ఆ ఘోరమైన ఘటన ఎలా జరిగింది అని చెప్పించేందుకు ఏర్పాట్లు చేసి ఉండడం గమనించి జైల్లోనే నలుగురు నిందితులు పోలీసుల కళ్లుగప్పి సంఘటనా స్థలం నుండి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారట.


ఇక వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అర్ధ రాత్రి 2:00 కి జైలు నుంచి బయలుదేరిన వారు సరిగ్గా 3 గంటల 30 నిమిషాల సమయంలో ఘటనా స్థలంలో దిశ సెల్ ఫోన్ పాతిపెట్టిన చోటు చూపించగానే ఒకరికి ఒకరు సైగలు చేసుకొని పరుగు లంకించుకున్నారు. పోలీసులకు ఇటువంటి ఘటనలు కొత్తేమీ కాదు కాబట్టి వారి జాగ్రత్తలో వారు ఉన్నారు. వెంటనే నిందితులు వారిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నప్పుడు తమ తుపాకులు తీసి వారిని కాల్చి పారేశారు. సరిగ్గా చెప్పిన మాట వినుంటే కొద్ది రోజులకు రిప్లై లేదు కానీ చివరికి ఎక్కడైతే ఆమెను చంపారో అక్కడే వీరు కుక్కచావు చావాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: