దిశ మీద జరిగిన దారుణంతో వారిని బహిరంగంగా ఊరి తీయాలని తెలంగాణ పోలీసుల మీద దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఇంతకుముందెప్పుడూ ఇలా భారతదేశం మొత్తం దోషులకు ఉరిశిక్ష వేయాలని తమ గళాన్ని ఎత్తిన దాఖలాలు లేవు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు మృగాలని ఎన్కౌంటర్ చేయించి చంపియాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్ సజ్జనార్... ఆడవాళ్ళ జోలికి వస్తేనే ఎన్కౌంటర్ చేసే మనస్తత్వం అతనిది. ఇక మన భారత దేశ ప్రజలంతా ఇలా కోరుకుంటుంటే అతను ఈ సరైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


కానీ దిశ కేసులో ప్రతి ఒక్కటి చట్టబద్ధంగా చేసి అటు చట్టానికి.. ఇటు ప్రజలకి ఎంతో గౌరవం ఇచ్చిన ప్రభుత్వానికి, పోలీసులకు హ్యాట్సాఫ్ అని చెప్పవచ్చు. ఈ ఎన్కౌంటర్ పై రేపు బిన్నాభిప్రాయాలు జాతీయస్థాయిలో వినిపించావొచ్చో కానీ ప్రస్తుతం మాత్రం... ఇలా సత్వర శిక్ష విధించిన తర్వాత దేశం మొత్తంలో ఏ ఒక్కరు కూడా అది సరైంది కాదంటూ తమ వ్యతిరేకతను తెలియజేయడం లేదు. ఇది చరిత్రలోనే గొప్ప సానుకూలమైన ఎన్కౌంటర్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.


దిశకు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేసిన విధానం మనం నిచ్చింతగా పరిశీలిస్తే... ప్రతి ఒక్క విషయం చాలా చట్టబద్ధంగా ప్రణాళికగా వ్యవహరించినట్లు స్పష్టమౌతుంది. కోట్ల మంది ప్రజల డిమాండ్ చేస్తున్నారు కదా అని.. వారిని వెంటనే బయటకు తీసుకొచ్చి టపా టపా కలుద్దామనే నిర్ణయాన్ని తీసుకోలేదు. అందుకే సీన్ రీ కన్స్ట్రక్షన్ అనే ఒక లీగల్ యాక్ట్ తెరపైకి వచ్చింది. మొదటిగా దిశ హత్య అత్యాచారం జరిగిన తర్వాత... కేసు నమోదుచేసి, ఆ తర్వాత దర్యాప్తు చేసి, నలుగురు మృగాళ్ళని 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ స్వయంగా నిందితులు ఉన్న పోలీస్ స్టేషన్ కి వచ్చి వారికి 14 రోజుల పాటు రిమాండ్ అని ప్రకటించాడు. ఆ పై భారీ భద్రత నడుమ నిందితులను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు.



అందరికీ మటన్ పెట్టినట్టే వీరికి కూడా మటన్ పెట్టి బాగా మేపారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు దిశ తో మాట్లాడిన సంభాషణ గురించి వినాలి అంటూ, ఫోన్ దొరికితే మరిన్ని అంశాలు బయటి వస్తాయంటూ... కస్టడీలోకి ఇవ్వాలంటూ షాద్ నగర్ కోర్టు కుు పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత కోర్టు ఏడురోజులపాటు కస్టడీలోకి ఇవ్వడంతో వారిని డిసెంబర్ 5వ తారీకు... ఘటనాస్థలానికి తీసుకెళ్లి రికన్స్ట్రక్షన్ చేసి దిశ ఫోన్ తో సహా కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత తెల్లారగానే... సీన్ రీ కన్స్ట్రక్షన్ తీసుకువెళ్లిన నిందితులు తప్పించుకోవడం కోసం... పోలీసులపై దాడి చేసి గాయపరిచిన మృగాలను... తప్పనిసరై తమ ఆత్మరక్షణ కోసం పోలీసులు అత్యాచార దోషాలను ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. పర్ఫెక్ట్గా... న్యాయానికి, చట్టానికి కట్టుబడి విధి నిర్వహణలో భాగంగా దోషులను ఈ లోకం నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ప్రభుత్వం తనకంటూ ఒక స్ట్రాంగ్ సమర్థతను ఇచ్చుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: