ఒక ఉప్పెన వచ్చెముందు కనబడే నిశబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇప్పుడు తెలంగాణ పోలీసులు నిరూపించారు.. దేశ ప్రజలు చంపేయండీ, ఉరితీయండి, అంటూ ఎన్ని నినాదాలు చేసిన, ఎంతగా అల్లర్లు సృష్టించినా ఏ విషయంలో కూడా అతిగా స్పందించకుండా చట్టం తనపని తాను చేసుకుంటూ పోయింది.

 

 

ఎక్కడ కూడా నిందితుల విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నారో అసలు భయటకు పొక్కనీయకుండా మృగాళ్లను, తోడేళ్లనూ మట్టిలో కలిపేసి భరతమాత కన్నీరును తుడవడానికి మేముకూడా ఉన్నాము. మాకు ఆడపిల్లలు ఉన్నారు. అని నిరూపించారు. ఇకపోతే తెలంగాణ పోలీసులను చూసి మిగత రాష్ట్ర పోలీసుల్లో కూడా చలనం రావాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొంటున్నారు. ఇకపోతే ఇప్పటికే ఇప్పటికే దిశ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 

 

పోలీసుల చర్యను సోషల్‌మీడియా వేదికగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులపై  బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రంలో నేరాలు పెరిగి పోతున్నప్పటికీ సర్కారు నిద్రపోతోందని దుయ్యబట్టారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుండా మొద్ద నిద్రపోతోందని విమర్శించారు.

 

 

హైదరాబాద్ పోలీసులను చూసి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు నేర్చుకోవాలని ఆమె సూచించారు. అయితే, యూపీలో మాత్రం దురదృష్టవశాత్తూ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జంగల్ రాజ్ కొనసాగుతోందని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ దిశ ఎన్‌కొంటర్ ఘటన అమ్మాయిలను హతమార్చే ప్రతి వారికి చెడ్దీలు తడిచిపోయేలా చేసింది.

 

 

దీన్ని బట్టి అర్ధం అయ్యింది ఏంటంటే ఇకనుండి ఏ ఎధవ ఇలాంటి వెధవ వేషాలు వేసిన, అత్యాచారం చేసిన ఇలాంటి శిక్షనే వేస్తామని కామాంధులను హెచ్చరిస్తున్నారు. కాబట్టి యువత క్షణికమైన సుఖం కోసం నూరేళ్ల జీవితాన్ని దిక్కులేని చావుకు అర్పించకండని, జాగ్రత్తగా సమాజంలో బ్రకండని చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: