ఒక పక్క తెలంగాణలో జరిగిన దిశా సంఘటన సంచలనం సృష్టిస్తుంది, మరో వైపు ఢిల్లీలో  పౌరసత్వం బిల్లును ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాలం సమావేశాల్లో ఈ బిల్లును పాస్ చేసుకోవాలని బిజెపి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తోంది. అసలు ఈ పౌరసత్వ బిల్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము, మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు మనకు ఉపయోగ పడుతుందా లేదా అనే విషయం, ఇప్పుడు మేము మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. 

 

ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు చాలా బలమైన వైఖరి తీసుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పిలుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పార్లమెంటులో బిల్లును ఆమోదించడం ప్రభుత్వానికి అంత సులభం కాదని అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు ఇచ్చాయి కూడా.

 


పౌరసత్వం (సవరణ) బిల్లు -2019 బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుండి ఆరు మైనారిటీ వర్గాలకు భారత పౌరసత్వాన్ని అందిస్తుంది. ఈ ఆరు సంఘాలు - హిందూ, బౌద్ధ, జైన, పార్సీ, క్రిస్టియన్,సిక్కులు. ప్రస్తుతం, భారతదేశ పౌరసత్వం పొందడానికి ఒక వ్యక్తి కనీసం 11 సంవత్సరాలు ఇక్కడ ఉండడం తప్పనిసరి. పౌరసత్వం బిల్లు ఈ కాలాన్ని ఆరు సంవత్సరాలకు తగ్గిస్తుంది. ఈ వర్గాల ప్రజలు ఆరు సంవత్సరాలలో భారత పౌరసత్వం పొందటానికి వీలు కల్పిస్తుంది.

 

అసలు పౌరసత్వ చట్టం 1955 ప్రకారం, అక్రమ వలసదారులను జైలులో ఉంచవచ్చు లేదా విదేశీయుల చట్టం 1946 ప్రకారం తిరిగి తమ దేశానికి పంపవచ్చు. కానీ 2015,2016 లో కేంద్ర ప్రభుత్వం 1946 చట్టాలలో కొన్ని సవరణలు చేసింది. ఇది హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి భారత దేశంలో ఉండటానికి మినహాయింపు ఇచ్చింది. ఈ వర్గాలకు చెందిన వ్యక్తులు గుర్తింపు పత్రాలు లేకుండా భారతదేశంలో నివసిస్తుంటే, వారిని ఖైదు చేయలేరు లేదా బహిష్కరించలేరు. ఈ మినహాయింపు 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు భారతదేశానికి చేరుకున్న వారికీ మాత్రమే ఇవ్వబడింది.కానీ ఇందులో ముస్లిములకు అవకాశం లేకపోవడంతో చాలా మంది దీనిని వెతిరేకిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: