దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ ను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన హత్య చేసిన రేపిస్టులకు తగిన శాస్తి జరిగింది. రేపిస్టులు మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దిశ కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే వారిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది.

 

ఇదే సమయంలో దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ విషయం తలచుకుంటే దాదాపు 11 ఏళ్ల కింద.. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ గుర్తొస్తుంది. అప్పుడు కూడా వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. అసలు అప్పుడు ఏం జరిగిందంటే.. 2008 డిసెంబర్‌ 10వ తేదీన వరంగల్‌లో స్వప్నిక తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి బైక్ పై వెళుతుండగా శాఖమూరి శ్రీనివాస్‌ అనే యువకుడు యాసిడ్‌ పోశాడు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు యువతులను వెంటనే హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

 

యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక మరణించింది. పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌తో పాటు అతనికి సహకరించిన బజ్జూరి సంజయ్‌, పోతురాజు హరికృష్ణలను అదుపులోకి తీసుకొన్నారు. యాసిడ్ దాడి ఘటన జరిగిన మూడో రోజు రాత్రి నిందితులు ముగ్గుర్నీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు వాడిన బైకు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకోవడానికి నిందితులను వరంగల్ నగర శివార్లలోని మూమునూరు విమానాశ్రయం వద్దకు తీసుకెళ్లినప్పుడు వారు తమపై దాడి చేశారని పోలీసులు తెలిపారు.

 

ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నిందితులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో వరంగల్ జనం పోలీసులుకు జేజేలు పలికారు. అప్పుడు కూడా వరంగల్ ఎస్పీ సజ్జనారే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: