మనిషి ఇప్పుడు విశ్వాన్ని అంతా జయిస్తున్నాడు.. ఆకాశం, భూమి, సముద్రం అన్నింటా తన ఆదిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. పిల్లాడు మారాం చేస్తే ఆకాశంలో చందమామను చూపించేవారు.. అయితే ఆ చందమామ వద్దకు చేరుతామా అన్న సందేహాలు అప్పట్లో ఉండేవి.  కానీ చంద్రగ్రహం పై కాలు మోపిన విషయం తెలిసిందే.  సముంద్రాన్ని చీల్చుకుంటూ లోతుకు వెళ్లి పరిశోదనలు చేస్తున్నారు.   భూమి పై మానవుడు ఆవిష్కరించని వస్తువంటూ లేవు.  ఇలా టెక్నాలజీతో వినూత్న ప్రయోగాలతో దూసుకు వెళ్తున్న మనిషి ఒక్క దైవం, దెయ్యం విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవుతున్నారు.  ముఖ్యంగా ఆచారాలు, కట్టుబాట్లు తలొగ్గుతున్నారు.  ప్రపంచంలో ఎన్నో వింత వింత ఆచారాలు ఉన్నాయి.. వాటి గురించి వింటుంటే ఒళ్లు ఝలదరించేలా ఉంటాయి.  బ్రతుకుతారు లేకుంటే మీ జీవితం కష్టాల్లో పడుతుంది అనే అంతగా నమ్మే మూడాచారాలను కలిగి ఉంటారు.

 

వెస్ట్ ఆఫ్రికాలో ఒక తెగ వాళ్ళు కత్తులతో గాయాలు చేసుకుంటారు.  పాలు తాడం మానేసిన చిన్న పిల్లల నుంచి పెళ్లీడు వచ్చిన యువత వరకు కత్తులతో గాట్లు పెట్టుకుంటారు.  చిన్న పిల్లలకు కత్తితో మొహం మీద గాట్లు పెడతారంట. ఒక్క సారి , రెండు సార్లు కాదండి ఏకంగా ముప్పై నిమిషాలు ఈ గాట్లు పెడతారట. ఇక పెళ్లి కావాల్సిన మగవాళ్లకు వాళ్ళ పొట్టపై గాట్లు పెడతారంట.ఈ భాదను భరించిన వాళ్ళు , జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొంటారని వాళ్ళ నమ్మకం.

 

అమెజాన్ ప్రాంతాల్లో గిరిజన తెగల ఆచారం చూస్తే నివ్వెర పోతారు. పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్ళు బుల్లెట్  చీమలతో కుట్టించుకోవాలి.  ఆ చీమలు కుడితే ఓళ్లంతా ఝలదరిస్తుంది.. నొప్పి పుడుతుంది.  గ్లౌజ్ వంటి వాటిలో వందకు పైగా చీమలు ఉంచి వాటిలో చేతులను ఉంచి పది నిమిషాలు కుట్టిపిచుకోవాలి. అలా రోజులో ఆరు సార్లు కుట్టిపిచుకోవాలట. వాటి బాధను తట్టుకున్నవాడు జీవితంలో ఏ బాధైన భరిస్తారని ఆచారం. యనమామి అనే ఒక గిరిజన తెగ వాళ్లకు ఓ దారుణమైన వింత ఆచారం ఉంది.

 

ఇది కాస్త భయాన్ని కల్పించినా.. నిజం. ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళను కట్టెల మీద కాల్చి , కాలిన ఎముకలను తీసుకొని సూప్ చేసుకొని తాగుతారంట. తమతో కలిసి తిరిగిన వారు.. చనిపోయిన తర్వాత వారి ఎముకలు సూప్ చేసుకొని తాగడం నిజంగా షాకింగ్ కి గురి చేస్తుంది. అమెజాన్ సుర్మా అనే తెగ అమ్మాయిలకు వాళ్ళ లిప్ సైజు ను బట్టి వారికి డిమాండ్ అనేది ఉంటుందట. అలా ఉన్నవారికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారట.. అందుకోసం అమ్మాయిలకు చిన్న గా కింద పెదవిని కత్తిరించి ,దానిలో ఒక చెక్క డబ్బా పెడతారు . అలా కొద్దినెలల ఉంచుతారు. వారి కింద పెదవి రెండు సెంటీమీటర్ల నుండి నాలుగు సెంటీమీటర్ల వరకు పెరుగుతుందట.

 

ఇలా పెదవులు పెరిగిన అమ్మాయికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని వారి ఆచారం. మాఫీ డవ్ గ్రామంలో దాదాపుగా 5 వేల మంది జనాభా ఉంటుంది. ఇక్కడ ఎవరూ బిడ్డలను కనరు.. పక్క ఊరిలో కంటారు.  జంతువులను పెంచరు.. చనిపోయిన వారిని పక్క ఊర్లో పాతిపెడతారు.  అయితే దీని వెనుక ఓ కథ ఉందని నమ్ముతారు.  

 

టాగ్బే గబెవొఫియా అకిటీ అనే వేటగాడు మొదటిసారిగా ఈ గ్రామంలో అడుగుపెట్టాడు.  ఆయనకు ఆకాశవాణి వినిపించింది. “మాఫీ డౌవ్ చాలా ప్రశాంతమైన ప్రాంతం. అక్కడ ప్రజలు జీవించాలంటే పిల్లలను ప్రసవించకూడదు. జంతువులను పెంచకూడదు. శవాలను పూడ్చిపెట్టకూడదని ఆకాశవాణి అకిటీకి చెబుతుందట. అప్పటి నుంచి ఈ తరహా వింత ఆచారాలు చేస్తూ వస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: