ఎన్ కౌంటర్ ఏదైనా పోలీసులు  సర్వసాధారణంగా చెప్పేది ఒక్కటే విషయం . నిందితులు తమ వద్ద ఆయుధాలను లాక్కుని ఫైరింగ్ ఓపెన్ చేశారని , తాము ఆత్మరక్షణ కోసమే  కాల్పులు జరిపామని చెబుతుంటారు . దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన శంషాబాద్ పోలీసులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు . అయితే ఈ విషయం ఎంత మాత్రం నమ్మశక్యంగా లేకపోయినా , పోలీసులు చేసిన పనికి  వారిపై ప్రజలు పూలవర్షం కురిపిస్తుండడం చూస్తే , వారు చేసిన పనికి ఎంతగా ప్రజామద్దతు ఉందో ఇట్టే స్పష్టమవుతుంది .

 

 సాధారణంగా ఎన్ కౌంటర్ పై నిరసనలు వ్యక్తం కావడం సర్వ సాధారణమే కానీ దిశ నిందితుల్ని ప్రజలే ఉరి తీయాలని లేదంటే  ఎన్ కౌంటర్ చేయాలని కోరుతున్న విషయం తెల్సిందే . ప్రజల అభ్యర్ధన మేరకే నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం తో వారికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించడమే కాకుండా , వారిని హీరోలుగా అభివర్ణిస్తూ అభినందలను కురిపిస్తున్నారు . దిశ నిందితుల్ని ఎన్  కౌంటర్ చేసిన పోలీసులను కలిసి మిఠాయిలు తిన్పించడమే కాకుండా శంషాబాద్ పోలీసు జిందాబాద్ , తెలంగాణ పోలీసు జిందాబాద్ అంటూ మహిళలు, స్థానిక యువత పెద్ద ఎత్తున నినాదాలు చేయడమే కాకుండా , పోలీసులకు సెల్యూట్ చేస్తున్నారు .

 

 ఇక శంషాబాద్ పోలీసు స్టేషన్ కు పెద్ద సంఖ్యలో జనం హాజరు కావడమే కాకుండా పోలీసులకు మద్దతు పలకడం చూస్తుంటే ... ఇటీవల నిందితుల్ని జైలు తరలించే క్రమం లో స్టేషన్ పై దాడికి యత్నించింది వీరేనా ? అన్న అనుమానం కలుగ మానదు . నిందితుల్ని జైలు కు తరలించే సమయం లో పోలీస్ స్టేషన్ పై దాడి చేసినంత  పని చేసిన స్థానికులు , వారిని ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల్ని అభినందించేందుకు పోటీ పడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: