దిశపై  హ‌త్యాచారం చేసిన‌ న‌లుగురు  నిందితుల‌ను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంపై సోష‌ల్ మీడియాలో జ‌నాలు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీపీ స‌జ్జానార్‌కు కోటి దండాలు అంటూ పేర్కొన్నారు. సాహో..శభాష్ సజ్జనార్ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక‌ ట్విట్టర్‌లో అయితే  టాప్ - 5లో తెలంగాణ పోలీసు ట్రెండ్ అవుతుండ‌టం గ‌మ‌నార్హం.  ఎన్ కౌంటర్‌పై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, జాతీయ నాయ‌కులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ అభిప్రాయ‌న్ని పంచుకుంటున్నారు.

 

కొంత‌మందైతే..దేశంలోని ఇంకా ఎంతో మంది రాక్ష‌స‌లున్నార‌ని..వారిని సంహ‌రించ‌డానికి ఇలాంటి ప‌దునైన వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మంటూ అభిప్రాయాన్ని తెలియ‌జేస్తున్నారు. సీపీ స‌జ్జ‌నార్ రియ‌ల్ లైఫ్ సింగం అంటూ దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు కొనియాడుతున్నారు. మాకో స‌జ్జ‌నార్ కావాలంటూ వివిధ రాష్ట్రాల‌కు చెందిన యువ‌త స‌జ్జ‌నార్ ఫోటోను ఫేస్‌బుక్ వాల్‌పై పెట్టుకుంటున్నారు. స‌జ్జ‌నార్ సార్ మీకు సెల్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

ఇక గ‌తంలో స్వ‌ప్నిక అనే అమ్మాయిపై వ‌రంగ‌ల్‌లో యాసిడ్ దాడి జ‌రిపిన‌ప్పుడు కూడా ముగ్గురు నిందితుల‌ను కూడా ఎన్‌కౌంట‌ర్ చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. త‌క్ష‌ణ న్యాయానికి స‌జ్జ‌నార్ స‌ర్ పెట్టిందిపేరు అంటూ ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రాజ్యాంగంలో నూత‌న చ‌ట్టాల‌ను తీసుకురావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని మ‌రికొంత‌మంది అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

 

మరోవైపు దిశా ఉంటున్న నక్షత్ర అపార్ట్ మెంట్ వద్ద అయితే సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. ట‌పాసులు పేల్చి...స్థానికులు స్వీట్లు పంచుకున్నారు. జయహో తెలంగాణ పోలీసు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కూడా స్వీట్లు తినిపించారు. డయల్ 100కు అభినందనలు తెలియచేస్తున్నారు.

 

నేర‌స్థుల‌కు గుణపాఠం చెప్పే పోలీసు అధికారి తెలంగాణాలో ఉన్నందుకు గర్వంగా ఉందని మరొకరు..పోలీసుల చర్యతో ప్రజలు సంతోషంగా ఉన్నార‌ని ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. జాతీయ మీడియా కూడా నాన్ స్టాప్ లైవ్‌ల‌తో చ‌ర్చ‌లు పెడుతుండ‌టంతో దేశంలో ఈ ఎన్‌కౌంట‌ర్ సంచ‌ల‌నం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: