సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సీన్ రీకన్ స్ట్రక్షన్ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో  పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. 'దిశ హత్యకేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. దిశ లాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుతున్నా' అని అన్నారు.

 

 

'దిశ ఉదంతం కనువిప్పు కావాలి. బహిరంగ శిక్షలు అమలు చేయాలి' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీఎస్పీ అధినేత మాయావతి మాట్లాడుతూ.. 'ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. యూపీ ప్రభుత్వం నిద్రపోతోంది. ఢిల్లీ, యూపీ పోలీసులు హైదరాబాద్ పోలీసుల నుంచి ప్రేరణ పొందాలి. దురదృష్టవశాత్తు నేరస్థులను అతిథుల మాదిరిగా చూస్తున్నారు' అని అన్నారు. 'నిందితులకు సరైన శిక్ష పడింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి' అని హేమమాలిని అన్నారు. భగవంతుడే పోలీస్ రూపంలో వాళ్లకు శిక్ష వేశాడు. పోలీసులు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్ కౌంటర్ ను ఛత్తీస్ గడ్  సీఎం భూపేష్ స్వాగతించారు. దిశ ఆత్మకు శాంతి చేకూరిందన్నారు. 'పోలీసులు గొప్ప పని చేశారు.. దిశకు న్యాయం జరిగిందని అన్నారు.

 

 

మహిళల రక్షణకు ఈ ఎన్ కౌంటర్ భరోసా ఇచ్చింది. ప్రజల్లో వచ్చిన మార్పు వచ్చింది. నిందితులు జైలులో ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.. అని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఘటనకు సంబంధించి.. నలుగురు నిందితులు జైలులో ఉన్న సమయంలో  అక్కడి పరిసరాలలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఎన్ కౌంటర్ పై హర్షం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: