ఒక్కడు... ఒకే ఒక్కడు... న్యాయం ఒడిపోకుడదని తెగించిన పోలిసోడు... 11 ఏళ్ల కిందట సీన్ నే రిపీట్ చేస్తూ.... న్యాయం, ధర్మం నాలుగు కాళ్ల మీద నడుస్తుందని చాటి చెప్పిన ఖలేజా ఉన్న ఖాకీ... దిశ కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ లో నిందితులను ఎన్ కౌంటర్ చేసి సాహో అనిపించుకుంటున్న సజ్జనార్... అసలు ఎవరి సజ్జనార్?.  కర్ణాటకకు చెందిన విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ 1996 ఐపిఎస్ అధికారి. ఉమ్మడి ఏపీ లో అనేక హోదాల్లో పనిచేసిన సజ్జానార్ ... అన్యాయం, అధర్మం, అవినీతికి పాల్పడ్డ నిందితుల నార తీసాడు. 

 

జస్ట్ లైక్ ఏ హీరో... సజ్జనార్ రికార్డ్స్ ఆల్ టైమ్ రికార్డ్స్.  దాదాపు 11 ఏళ్ల కిందట   2008 డిసెంబర్ 12 లో వరంగల్ కిట్స్ కాలేజ్ స్టూడెంట్స్ స్వప్నిక, ప్రణీత లపై ఆసిడ్ ఎటాక్ జరిగింది. తోటి స్టూడెంట్ తన ప్రేమను అంగీకరించలేదని మరో ఇద్దరి తో కలిసి స్వప్నిక, ప్రణీత లపై దాడికి దిగారు. ఘటనలో స్వప్నిక చనిపోగా... ప్రణీత గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై అప్పట్లో సామాన్యులు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. దీంతో మూడు రోజుల్లోనే కేసును ముగించేసాడు అప్పటి వరంగల్ ఎస్పీ సజ్జనార్. ]

 

కేసు రికన్స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన స్థలానికి తీసుకెళ్లిన సజ్జనార్... పోలీసులపై తిరగబడ్డారు అని .. పారిపోయేందుకు ప్రయత్నించారు అని... ఎన్ కౌంటర్ చేసి కేసు క్లోజ్ చేసాడు. ఈ ఎన్ కౌంటర్ తో స్వప్నిక ఆత్మకు శాంతి చేకూర్చిన సజ్జనార్... అలాంటి సాహసం చేసేందుకు ప్రయత్నిస్తే పనిష్మెంట్ తప్పదని మగ మృగాలను హెచ్చరించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. 

 

మళ్లీ అదే సజ్జనార్... హైదరాబాద్ సీపీ సజ్జనార్... ఆడపిల్ల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే చావు తప్పదని చాటి చెప్పాడు. దిశ హత్య కేసు యావత్ భారతాన్నే కుదిపేసింది. అలాంటి మదమెక్కిన మృగాలను ఎన్ కౌంటర్ చేయాలని నిరసనలు వెల్లువెత్తాయి. వెంటనే వాళ్లను చంపేయాలని అటు ప్రభుత్వం.. ఇటు పోలీస్ శాఖ పై ఒత్తిడి తెచ్చారు.

 

మీ వల్ల కాకపోతే మాకు అప్పగించండి మేమే చంపేస్తాం అంటూ...  పోలీసులపై సామాన్యులు చెప్పులు విసిరారు కూడా...  ఈ ఘటనలతో ఓ నిర్ణయం తీసుకున్న సజ్జనార్... సీన్  రికన్స్ట్రక్షన్ పేరు తో వరంగల్ సీన్ రిపీట్ చేశాడు. దిశను అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి చంపిన చోటే ... ఎన్ కౌంటర్ చేసి... దిశకు, దిశ తల్లిదండ్రులకు న్యాయం చేశాడు. తెలంగాణ ప్రజల నుంచి పూల వర్షాలను , అభినందన వెల్లువలను అందుకున్నారు. 

 

‌ఈ కేసు లో సజ్జనార్ చెప్పింది ... పోలీసుల పై తిరగబడితే ఊరుకునేది లేదని. నిందితులు పోలీసులపై రాళ్ల దాడి చేసి ... గాయపరిచి... పారిపోయేందుకు ప్రయత్నించారు అని చెప్పాడు. అందుకే కాల్చేశారు అని నిర్ధారించారు.  పోలీసు పై చెయ్యేస్తే చూస్తూ ఊరుకోం అని చెప్పిన సజ్జనార్... మెదక్ ఎస్పీ గా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఓ కానిస్టేబుల్ చంపిన గంజాయి సప్లయర్ ను కూడా ఎన్ కౌంటర్ చేశాడు. అలాంటి రౌడీలను చాలా మందిని ఏరిపరేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: