తెలుగుదేశంపార్టీపై తెలంగాణాలో తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ తీవ్ర ప్రభావం చూపింది. టిడిపికి తెలంగాణాలో ఎన్ కౌంటర్ కు లింకు ఏమిటంటారా ? ఉంది లేండి. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గుంటూరులో నిర్మించిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే రాష్ట్రస్ధాయి కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది.  చంద్రబాబునాయుడు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.

 

మూడు అంతస్తుల్లో మూడు బ్లాకుల్లో నిర్మాణం జరుగుతోంది. మొదటగా ఒకటవ నెంబర్ బ్లాకును ప్రారంభించారు. మామూలుగా అయితే మెజారిటి చానళ్ళల్లో  ఇదే ప్రముఖ వార్తగా ఉంటుంది. ఎందుకంటే మీడియాలో మెజారిటి వాటా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులవే అన్న విషయం అందరకీ తెలిసిందే. కాబట్టి టిడిపి లేదా చంద్రబాబుకు సంబంధించిన ఎంత చిన్న కార్యక్రమానికైనా పెద్ద కవరేజ్ ఇవ్వటం అందరికీ తెలిసిందే.

 

అలాంటిది రాష్ట్రస్ధాయి కార్యాలయం ప్రారంభం జరిగేటపుడు ఇక ప్రచారానికి లోటేముంటుంది ? కానీ శుక్రవారం తెల్లవారిజామునే శంషాబాద్ మండలంలో దిశ హత్యాచార నిందుతుల ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిన విషయం ఉదయం 8 గంటల ప్రాంతంలో వెలుగు చూసింది. ఇంకేముంది మొత్తం మీడియా దృష్టంతా ఒక్కసారిగా శంషాబాద్ మండలంలోని చటాన్ పల్లిలో ఎన్ కౌంటర్ ఘటన పైకి వెళ్ళిపోయింది.

 

దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ అంతకన్నా ఎక్కువ సంచలనంగా మారింది. దాంతో జాతీయ మీడియా నుండి లోకల్ చానల్స్ కవరేజి కూడా పూర్తిగా ఎన్ కౌంటర్ కు సంబంధించిన వార్తలు, కథనాలతోనే నిండిపోయింది. ఈ హడావుడిలో మంగళగిరిలో ప్రారంభమైన టిడిపి రాష్ట్ర కార్యాలయం ఎపిసోడ్ ను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో చంద్రబాబు అండ్ కో పూర్తిగా డల్ అయిపోయారు. టిడిపి ఎప్పుడే కార్యక్రమం చేపట్టినా పబ్లిసిటీ విషయంలో మాత్రం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుందన్నది తెలిసిందే. కానీ ఇపుడు మాత్రం చేయగలిగేది లేక పబ్లిసిటి విషయాన్ని పక్కనపెట్టేసింది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: