ఒకపక్క దిశ ను హత్య చేసిన నలుగురి పై ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ తో దేశం మొత్తం సంబరాలు జరుపుకొంటూ ఉండగా మరొక పక్క తమ కన్న బిడ్డల మృతదేహం చూసి వారి ఇంటి వారు కన్నీరుమున్నీరయ్యారు. ముందు నిందితులు అరెస్టు అయినప్పుడు వారికి తగిన శిక్ష వేయాలని అందరితోపాటు కోరుకున్న తల్లిదండ్రులు కాస్తా వారి కన్నబిడ్డలను విగతజీవులుగా చూసి తమని తాము అదుపులోకి పెట్టుకోలేకపోయారు. ఒక్క సారిగా వారి మృతదేహాన్ని చూసి బోరున విలపించడం మొదలు పెట్టినవారు తర్వాత తమ కన్న బిడ్డలను ఎన్ కౌంటర్  చేసిన విధానం చాలా నాటకీయంగా ఉందని అన్నారు.


శివ యొక్క తండ్రి మాట్లాడుతూ ఇంతకు ముందు జరిగిన రేప్ కేసుల్లో నిందితులకు ఇటువంటి శిక్షలు ఏనాడూ వేయలేదని... కేవలం తమ బిడ్డకే ఇలా చేసి అన్యాయం చేశారని ఆయన అన్నాడు. ఉంటే అందరికీ ఒకటే న్యాయం ఉండాలని... అధికారులు తమ పిల్లలపై పక్షపాతం చూపించడం ఏమాత్రం సరికాదని ఆయన తన బాధను వెళ్లగక్కాడు. చట్టపరంగా వారిని కోర్టుకు తీసుకువెళ్లి న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తే సబబుగా ఉండేదని అతని అభిప్రాయం. 

 

ఇంకా మిగతా వారి తల్లిదండ్రులు అయితే కావాలనే ఒక పథకం ప్రకారం తమ బిడ్డలను హత్య స్థలానికి తీసుకుని వెళ్లి అక్కడ వారిపై ఎన్ కౌంటర్ జరిపి చివరికి వారు పోలీసు వారిని దాడి చేసినట్లు చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జనమంతా దిశకు మద్దతుగా మరియు ఎన్కౌంటర్ ను అభినందిస్తూ ఉండగా వీరికి మానవ హక్కుల సంఘం నుంచి మరి ఏ ఇతర సంస్థల నుంచి ఎటువంటి మద్దతు రాకపోవచ్చు. కానీ వారి మాటలు మరియు బాధ చూస్తుంటే కచ్చితంగా ఈ విషయం కేసు రూపంలో కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కనపడుతోందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అదే కనుక జరిగితే పోలీసు వారు సరైన సమాధానం మరియు ఆధారాలతో వీరి మాటలు తప్పు అని నిరూపించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: