దిశ హత్య కేసులోని నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎవ‌రికి వాళ్లు త‌మ సోష‌ల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసుల‌ను, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసిస్తున్నారు. ఉద‌యం ఎన్ కౌంట‌ర్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అటు సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు ఇత‌ర‌త్రా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సైతం ప్రశంసిస్తున్నారు. ఏపీ లేదు తెలంగాణ కాదు క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడే కాదు అటు నార్త్‌లో ప‌లు రాష్ట్రాల‌కు చెందిన వారు సైతం సోస‌ల్ మీడియాలో దిశ నిందితుల‌కు స‌రైన శిక్ష ప‌డింద‌ని ప్ర‌శంసిస్తున్నారు.

 

ఇక అటు బాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖులు సైతం ఈ సంఘ‌ట‌న‌పై త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ క‌ళాశాల‌ల‌కు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు రోడ్ల పైకి వ‌చ్చి సంబ‌రాలు చేసుకుంటున్నారు. వారం రోజులుగా దిశ కు అన్యాయం జ‌రిగింద‌ని రోడ్లెక్కి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టిన వారంతా ఈ రోజు రోడ్ల పైకి వ‌చ్చి డ్యాన్సులు చేస్తున్నారు.

 

తాజాగా విజయవాడ సిద్ధార్థ కళాశాల విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్ర‌వారం దిశ ఎన్ కౌంట‌ర్ వార్త తెలిసిన వెంట‌నే ఆ క‌ళాశాల అమ్మాయిలు అంతా సంతోషం వ్య‌క్తం చేశారు. వెంట‌నే కళాశాల ఆవరణలో డప్పు కొడుతూ నృత్యం చేశారు. దిశ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాతి చేకూరుతుందని విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ఏ ఒక్క మృగాడు కూడా అమ్మాయి ల వైపు చూడాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని కూడా వారు తెలిపారు.

 

శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు 'దిశ' హత్యోదంతం కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఈ తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: