దిశ హత్యాచారం కేసులో నిందితులను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. వెటర్నరీ వైద్యురాలు దిశ ఎక్కడ మృతి చెందిందో అక్కడే ఆ నిందితులు ఎన్కౌంటర్ చేసి చంపారు. సీన్ రికర్రెక్షన్ చేసే సమయంలో నలుగురు నిందితులు పారిపోడానికి ప్రయత్నించగా నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు. 

              

వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోసి ఆ నిందితులు కాల్చేశారు. అయితే అదే ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో నిందితులు మృతి చెందారు.  

           

అయితే ఆ నిందితులను ఎన్కౌంటర్ చెయ్యగా శంషాబాద్‌ నక్షత్ర కాలనీలో దిశ ఇంటి వద్ద పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. దిశ ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరికి అనుమతినివ్వడం లేదు పోలీసులు. దిశ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

      

ఆమె నివాసంలోకి ఎవరినీ అనుమతించొద్దని స్పెషల్‌ టీమ్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ చెయ్యగా దిశ ఇంటివద్ద మహిళలు అంత సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎక్కువమంది ప్రజలు అయ్యేసరికి పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఆ నలుగురి మృతదేహాలకు కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: