దిశ అత్యాచార , హత్య ఘటన నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్  చేసిన నేపధ్యం లో మరి నిర్భయ నిందితుల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది .  నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు అవుతున్నా, ఇంతవరకు నిందితులకు శిక్ష అమలుకాకపోవడం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి  . ఉరి శిక్ష విధించినప్పటికీ , ఇప్పటికి అమలుకాకపోవడం పట్ల ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే పోలీసులు న్యాయం చేశారని , తన బిడ్డ చనిపోయి ఏడేళ్లు అవుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు .

 

దేశ రాజధాని ఢిల్లీ లో 2012  డిసెంబర్ 15  న నిర్భయ పై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెల్సిందే . అనంతరం  చికిత్స పొందుతూ నిర్భయ  మృతి చెందింది . నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది . కానీ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు . దీనితో నిందితులు జైలు జీవితం గడుపుతున్నారు . దిశ అత్యాచార , హత్య ఘటన జరిగిన ఎనిమిది రోజుల్లోనే ఎన్ కౌంటర్ ద్వారా న్యాయం చేయగా , నిర్భయ నిందితులకు మాత్రం ఇప్పటి వరకూ శిక్ష అమలుకాకపోవడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి .

 

ఇక దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయాన్ని తెలుసుకున్న ఆమె  తల్లితండ్రులు తమ కూతురికి న్యాయం జరిగిందని చెప్పారు . దిశ ను ఎక్కడైతే కాల్చి చంపారో , అక్కడే నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయడం ద్వారా ఆమెకు ఆత్మకు శాంతి చేకూరుతుందని  అభిప్రాయపడ్డారు . గత నెల 27 వ తేదీన దిశ పై నిందితులు అత్యాచారం చేసి   హత్య చేయగా , ఆ మరుసటి రోజే వారిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: