ఒక వివాహ వేడుకలో నృత్యం చేయడం మధ్యలో ఆపివేసిందనే కోపం తో ఓ దుండుగుడు ఓ యువతి ముఖంపై కాల్పులు జరపడం ఆశ్చర్యకరమైన విషయముగా మారింది. ఇప్పుడు  ఆమె పరిస్థితి చాలా విషమంగా మారింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో డిసెంబర్‌ 1వ తేదీన జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈమె మరో యువతితో కలిసి నృత్యం చేస్తున్న యువతి నృత్యాన్ని నిలిపివేయడంతో అక్కడి ఉన్న వారిలో నుంచి ఓ వ్యక్తి నృత్యం ఆపితే కాల్చివేస్తానని హెచ్చరించడం అందరినీ కలవరపరిచింది.

 

 మరో వ్యక్తి ఆమెపై కాల్పులు జరపాలని అన్నంతలోనే ఒక్క నిమిషం కూడా లేటు లేకుండా యువతి ముఖంపైకి బుల్లెట్‌ దూసుకువచ్చింది. బుల్లెట్‌ నృత్యం చేస్తూ న్న  ఆమె దవడలోకి సూటిగా దూసుకుపోయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గ్రామ పెద్ద అయినటువంటి సుధీర్‌ సింగ్‌ పటేల్‌ కుమార్తె పెళ్లి వేడుకలో ఈ ఘటన జరిగినది.

 

 కాల్పులు జరిగిన సమయంలో అక్కడే  వేదికపై ఉన్న పెళ్లి కూతురు మామలు మిథిలేష్‌, అఖిలేష్‌లకు కూడా కొంచెము గాయాలయ్యాయి. గ్రామ పెద్ద కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ దాడికి పాల్పడినట్టు అక్కడి సమాచారం. పెళ్లి కూతురు బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కానీ పెళ్ళి లో ఇలా జరగడం దురదృష్టకరం. కొన్ని పెళ్లి లలో సందడి కోసము చాలామంది డాన్స్ ప్రోగ్రాం లను ఏర్పాటు చేసుకోవడము ఆనవాయితీ. ఇలా వినోదం కోసం చేసిన ఏర్పాటుచేసిన నృత్యం చేసే యువతిపై అలా తుపాకితో కాల్చి చంపడం చట్టం నేరము. పగలు ప్రతీకారాలు ఉంటే వేరే విధంగా తీర్చుకోవాలి కానీ డ్యాన్స్ చేస్తున్న యువతి పై తుపాకితో కాల్పులు జరపడం అమానుషమైన చర్యగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: