కాంగ్రెస్ నాయకురాలు నేరెళ్ల శారద దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ గురించి మాట్లాడుతూ విచ్చలవిడి మద్యం అమ్మకాలే మహిళలపై అత్యాచారాలకు కారణం అని అన్నారు. మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ చేపట్టాలని చెప్పారు. అఘాయిత్యాలు చేయాలనుకునేవారికి భయం కలుగుతుందని ఆశిస్తున్నా అని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు ఎన్ కౌంటర్ మాత్రమే పరిష్కారం కాదని నేరెళ్లి శారద చెప్పారు. 
 
దిశ హత్య కేసులో ఎన్ కౌంటర్ కు గురైన నిందితుల తల్లిదండ్రులు ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు. సంఘటనా స్థలానికి మక్తల్ సీఐ శంకర్ నిందితుల తల్లిదండ్రులను తీసుకొనివెళ్తున్నారు. సంఘటానా స్థలానికి మహ్మద్ షాషా తండ్రి హుస్సేన్, శివ తండ్రి రాజప్ప, నవీన్ తల్లి లక్ష్మి, చెన్నకేశవులు తండ్రి కురుముప్ప బయల్దేరి వెళ్లారు. వనపర్తి ఎస్పీ అపూర్వారావు మృతుల బంధువులతో మాట్లాడారు. 
 
ఎన్ కౌంటర్ జరిగిన ఘటనాస్థలిలోనే పంచనామా చేశారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పంచనామా జరిగిందని తెలుస్తోంది. దిశ హత్య జరిగిన రోజే వరంగల్ లో ఒక కిరాతకుడి చేతిలో అమ్మాయి ప్రాణాలను కోల్పోయింది. బాధితురాలి తల్లిదండ్రులు దిశ కేసు నిందితులకు ఎలాంటి శిక్ష పడిందో తమ కుమార్తె కేసు విషయంలో నిందితులకు అలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. 
 
నలుగురు తమ కుమార్తెను హత్య చేశారని నలుగురిని ఎన్ కౌంటర్ చేయాలని ఎన్ కౌంటర్ చేస్తే మాత్రమే బిడ్డకు శాంతి కలుగుతుందని వారు చెప్పారు. దిశ ఇంట్లోకి ఎవరినీ అనుమతించవద్దని పోలీసులకు స్పెషల్ టీం ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ప్రజలు, నేతలు పోలీసులకు జేజేలు పలుకుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఇలాంటి శిక్షలే పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సినీ నటుడు బాలకృష్ణ దేవుడే పోలీసుల రూపంలో నిందితులను శిక్షించాడని చెప్పారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ పోలీసుల నుండి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: