దిశ హత్యాచారం కేసు.. ఈ కేసు గురించి ప్రతిఒక్కరికి కాదు దేశం మొత్తం తెలుసు. అతికిరాతకంగా ఒక వెటర్నరీ వైద్యురాలు దిశను అన్యాయంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమె శరీరంపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కనీసం ఆమె శవం కూడా దొరకకుండా ఒక ఆడపిల్లను అతికిరాతకంగా చంపినా ఘటనలో నిందితులు నిజం ఒప్పుకోగా ఆ నిందితులను రిమాండ్ లో ఉంచారు. 

 

అయితే నిన్న అర్ధరాత్రి అదే ఘటన స్థలంలో ఆ ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు. అయితె ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. నిందితులను ఎక్కడైతే ఎన్‌కౌంటర్‌ చేశారో అక్కడే సీపీ మీడియాతో మాట్లాడారు.

 

అయితే ఎప్పుడు ఎన్కౌంటర్ అని మాట్లాడని సజ్జనార్ మొదటిసారి అతని మాటలలో ఎన్ కౌంటర్ అనే మాట వినపడింది. ఎప్పుడు ఎన్కౌంటర్ అని మాట్లాడని సజ్జనార్ మొదటిసరి ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేశామని అయన వ్యాఖ్యానించారు. కాగా నిందితులు ఇద్దరు పోలీసులపై రాళ్లతో దాడి చేశారని అయన వ్యాఖ్యానించారు. నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులుకు తీవ్ర గాయాలు అయ్యాయి అని అయన వ్యాఖ్యానించారు. 

 

ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్ గౌడ్ కు నిందితుల దాడిలో తీవ్ర గాయాలయ్యాయి అని వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించాం అని అయన చెప్పారు. అనంతరం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించినట్టు నిందితుల దాడిలో పోలీసుల తలకు గాయాలయ్యాయి అని చెప్పారు. ఇతర రాష్ర్టాల్లోనూ ఇదే తరహాలో నిందితులు దాడులు చేశారు అని సీపీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: