లేడీ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను నేడు తెల్లవారు ఝామున పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంకను ఎంతో ఘోరంగా అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేసి తగులబెట్టిన నలుగురు నిందితులకు ఇదే సరైన శిక్ష అని దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. నేటి తెల్లవారుఝామున నిందితులను సీన్ రి కన్స్ట్రక్షన్ కోసం ప్రియాంకను తగులబెట్టిన స్పాట్ కు తీసుకెళ్ళాం అని, 

 

అయితే ఆ సమయంలో నిందితులు తప్పించుకునేందుకు తమపై రాళ్ల దాడి చేయడంతో పాటు తుపాకులు కూడా లాక్కునేందుకు ప్రయత్నించగా, వారిని అక్కడికక్కడే స్పాట్ లో ఎన్కౌంటర్ చేసినట్లు చెప్పారు ఎస్పీ సజ్జనార్. అయితే ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు మరియు ప్రజా సంఘాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇది కావాలని చేసింది కాదని, నిందితులు తప్పించుకోబోతుంటేనే ఆ విధంగా చేయవలసి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. కాగా ఈ ఘటన పై కొందరు నెటిజన్లు మాత్రం, ఈ విధంగా దోషులను కాల్చి ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు సబబని, 

 

అలానే ఇది ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘన కాదా అంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. అయితే వారు చెప్పినదానిలో కూడా న్యాయం ఉన్నప్పటికీ, ఎంతో ప్లాన్ ప్రకారం ఒక యువతి నిండు జీవితాన్ని ఏ మాత్రం కనికరం లేకుండా చిదిమేసిన అటువంటి క్రూరులకు అదే సరైన శిక్ష అని పలువురు ప్రజలు అంటున్నారు. అదీకాక అటువంటి నీచులను మానవ హక్కుల నిబంధనల క్రింద కనికరిస్తే, భవిష్యత్తులో అటువంటి మృగాళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా పోలీసులు చేసిన పని నూటికి నూరుపాళ్లు సరైనది అనేది చాలామంది ప్రజల వాదన. మొత్తానికి ఆ నలుగురు నిందితుల కాల్చివేతతో దిశా ఆత్మకు న్యాయం జరిగిందనేది మాత్రం వాస్తవం...........!!

మరింత సమాచారం తెలుసుకోండి: