‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తో తెలంగాణ పోలీసుల పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. దీనిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘దిశ’ కేసును పర్యవేక్షిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలనే నినాదం హోరెత్తిపోతోంది. అయితే.. దిశతో కలిపి గత ఐదేళ్లలో తెలంగాణలో మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి.

 

 

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వికారుద్దీన్‌ను 2014, ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసుల హత్య, గుజరాత్ హోంమంత్రిపై దాడి ఘటనపై వికారుద్దీన్‌ నిందితుడు. 2015 ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో వికారుద్దీన్ తో సహా ఆరుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. వరంగల్ జైలు నుంచీ హైదరాబాద్ తరలిస్తుండగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

 

 

అనేక ల్యాండ్ సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, హత్యలు చేస్తూ వేల కోట్ల ఆస్తులు పోగేసిన గ్యాంగ్ స్టర్ నయీంను కూడా ఎన్ కౌంటర్ చేశారు. ప్రభుత్వానికి సవాల్‌గా మారిన నయీంను 2016, ఆగస్టు 8న ఎన్‌కౌంటర్‌ చేసారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలో ఓ ఇంట్లో ఉన్న నయీంను పోలీసులు కాల్చి చంపారు. నయీం అనుచరులు ప్రతిఘటించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో నయీం అక్కడికక్కడే చనిపోయాడు. నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్ పై వందల్లో కేసులు ఉన్నాయి.

 

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద ‘దిశ’ను దహనం చేసిన చోటికి గురువారం అర్ధరాత్రి పోలీసులు నిందితులను తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేశారు. నయీం, దిశ.. ఇద్దరి ఎన్ కౌంటర్లలో సజ్జనార్ కీలక పాత్ర పోషించడం విశేషం. 2008.. వరంగల్ యాసిడ్ దాడి నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సమయంలో సజ్జనారే కీలకంగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: