టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి ఓ సినిమా వస్తుందంటే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. హిట్, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లు అతి తక్కువ కాలంలోనే సాధించిన ఈ రౌడీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. త్వరలో విడుదల కాబోతున్న వరల్డ్ ఫేమస్ లవర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఓ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

 

 

ఈ సినిమాలో విజయ్ నలుగురు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు. విజయ్ ఓ రైటర్ క్యారెక్టర్ పోషిస్తున్నాడని ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ నాలుగు షేడ్లు ఉన్న క్యారెక్టర్లు పోషిస్తున్నాడని అంటున్నారు. స్టూడెంట్, ఐటీ ప్రొఫెషనల్, మిడిల్ క్లాస్ కుర్రాడు, బైక్ రేసర్ గా పలు పత్రాల్లో కనిపిస్తాడని ఫిల్మ్ నగర్లో వార్తలు షికారు చేస్తున్నాయి. విజయ్ సరసన రాశి ఖన్నా, కేథరిన్ థెరిస్సా, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో ఈ వార్తపై ఓ క్లారిటీ వచ్చిందనే అంటున్నారు. ఇప్పటివరకూ ఈ వార్తపై ఎటువంటి స్పష్టత లేకపోయినా సినిమా కంటెంట్ వింటుంటే నిజమే అనిపిస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.

 

 

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ ఈ సినిమాను నిర్మించాడు. క్రాంతిమాధవ్ బుర్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. డియర్ కామ్రేడ్ ప్లాప్ తో కొంత డిప్రెషన్ లో ఉన్న విజయ్ కు ఈ సినిమా హిట్ కీలకంగా మారింది. కేవలం సినిమా పోస్టర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిందీ సినిమా. విజయ్ యాటిట్యూడ్ కి తగ్గట్టే పోస్టర్ ఉండడంతో యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే.. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: