గత నెల 28వ తారీఖు పశు వైద్యురాలైన దిశ ను నలుగురు నీచులు చటాన్‌పల్లి వద్ద అత్యాచారం చేసి హత్య చేసారు. అయితే ఆ దారుణ ఘటన జరిగి 10 రోజులు దాటకముందే... అదే ప్రదేశంలో ఈ రోజు పొద్దున్న వారి పాపం పండి ఘోరంగా చచ్చారు. అయితే ఈ తీపి కబురు విన్న దిశ తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా దిశ తల్లి మీడియా తో మాట్లాడుతూ... 7 సంవత్సరాలైనా నిర్భయకు న్యాయం జరగలేదు కానీ తన బిడ్డ విషయంలో తెలంగాణ పోలీసుల వలన 10 రోజులలోపే న్యాయం జరిగిందని... చనిపోయిన తన బిడ్డ తిరిగిరాకపోయినా.. దోషులను చంపినందుకు తనకు సంతోముగా ఉందని... గుండెలోని బాధ కాస్త తగ్గిందని. తన కూతురికి ఆత్మశాంతి చేకూరిందని... నలుగురి నీచుల ఎన్‌కౌంటర్‌తో వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి కలిగిందని చెప్పారు.

ఇంకా మాట్లాడుతూ... ఇంత తొందరగా తమకు న్యాయం జరుగుతుందని అనుకోలేదని.. తన కూతురిని హత్య చేసిన మృగాళ్ల శవాలను చూడాలని ఉందని ఆమె చెప్పారు. వాళ్ళని చంపినందుకు కాస్త ఉపశమనం కలిగిందని... కానీ మరణించిన తన కూతురు మళ్ళీ తిరిగి రాలేదన్న నిజమే వెంటాడి బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.

ఎన్కౌంటర్ చేసిన నిందితుల మృతదేహాలకు తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా పూర్తయింది. అయితే మరికాసేపట్లో అధికారులు... నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి... వైద్యులతోో శవపరీక్ష నిర్వహించనున్నారు. అయితే హాస్పిటల్ నుంచి నేరుగా గుడిగండ్ల స్మశాన వాటికి తీసుకెళ్లి మృతదేహాలను ఖననం చేసేందుకు పోలీసులు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే 3 బొందలను జేసీబీ సహాయంతో తీశారు. ఆరిఫ్, చెన్నకేశవులు... పోలీసులు వద్ద నుంచి తుపాకులను అపహరించి పోలీసులపై దాడి చేయబోయారు. జొల్లు శివ, జొల్లు నవీన్ చేసిన రాళ్ల దాడి వలన పోలీసులకు గాయాలై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: