ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రాజ‌కీయ వేడిని ర‌గిలిస్తుంది. గ‌త రెండు మూడు నెల‌లుగా ఏపీలో అమ‌రావ‌తి రాజ‌ధానిపై మాట‌ల మంట‌లు చెల‌రేగుతుండ‌గా, ఇప్పుడు ఏకంగా ఆరోప‌ణ‌లు భ‌గ్గుమంటున్నాయి. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణాలు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించిన త‌రువాత టీడీపీ నేత‌లు అమ‌రావ‌తిపై గొప్ప విజ‌యం సాధించిన‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం.. అమ‌రావ‌తిలో ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డం.. ప్ర‌జ‌లు అడ్డుకోవ‌డం.. చంద్ర‌బాబు కారుపై చెప్పులు, రాళ్ళు రువ్వ‌డం జ‌రిగింది.

 

అయితే ఇటీవ‌ల రౌండ్ టేబుట్ స‌మావేశం నిర్వహించారు చంద్ర‌బాబు. అయితే చంద్రబాబు ఓవైపు స‌మావేశం నిర్వ‌హిస్తే.. మ‌రోవైపు  మంత్రి బుగ్గ‌న రాజేంధ్ర‌నాద్ రెడ్డి మ‌రో స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఈరోజు బుగ్గ‌న రాజేంధ్ర‌నాథ్ రెడ్డి చంద్ర‌బాబుపైన, టీడీపీపైన ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌కు చంద్రబాబు కౌంట‌ర్ ఇచ్చారు. ఇప్పుడు బుగ్గ‌ర ఆరోప‌ణ‌ల‌కు, చంద్ర‌బాబు రియాక్ష‌న్ బాగానే ఆదిరింది. బుగ్గ‌న ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నాయంటే  టీడీపీ అనుకూలురు, నేతలకు అనూకులంగా ఉండేలా రాజధానిలో జోనింగ్ డిజైన్లు చేసుకున్నారని విమర్శించారు.

 

రాజధాని నిర్మాణానికి 1500 ఎకరాలు సరిపోతాయి. కానీ, దళితులు, అసైన్డ్ భూములు లాక్కొన్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతం రాకముందే భూములు కొనేశారని సంచలన ఆరోపణలు చేశారు బుగ్గన.. హెరిటేజ్ పేరుతో చంద్రబాబు డైరెక్ట్‌గా కొంటే, పరిటాల సునీత, పయ్యావుల, ధూళిపాళ్ల, జీవీ ఆంజనేయులు, యనమల వియ్యంకుడు, కొమ్మాలపాటి శ్రీధర్, కంభంపాటి రామ్మోహన్ వంటి వారికి వారి పేర్లతోనే భూములున్నాయని.. బినామీల పేరుతో పత్తిపాటి పుల్లారావు, వేమూరి రవి వంటి వారు భూములు కొన్నారని బయటపెట్టారు.

 

దీనికి స్పంద‌న‌గా చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్యానించారు. రాజ‌ధాని ప్రాజెక్టు త‌ప్ప‌ని జ‌న‌మంటే క్ష‌మాప‌ణ చెబుతా చంద్ర‌బాబు అన్నారు.  అమ‌రావ‌తిపై లేనిపోని అపోహ‌లు సృష్టిస్తున్నారని,  అమ‌రావ‌తిపై పెట్టుబ‌డులు రాక‌పోవ‌డానికి వైసీపీ స‌ర్కారే కార‌ణమ‌ని,  రాజ‌ధానిపై వెంట‌నే అఖిల ప‌క్షం ఏర్పాటు చేయాల‌ని టీడీపీ తీర్మాణం చేసింద‌ని చంద్ర‌బాబు అన్నారు. రాజ‌ధానిలో  బినామీ లావాదేవీలుంటే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

 

వైసీపీ నేత‌లు కావాల‌నే ఆరోప‌ణ‌లు చేస్తూ రాజ‌ధానిని అభివృద్ది చేయ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారని విమ‌ర్శించారు. ఇక‌నైనా వైసీపీ నేత‌లు రాజ‌ధానిని వెంట‌నే నిర్మించాల‌ని డిమాండ్ చేశారు. ఏదేమైనా బుగ్గ‌న ఆరోప‌ణ‌ల‌కు.. చంద్ర‌బాబు ప్ర‌త్యారోప‌ణ‌లు చేయ‌డంతో రాజ‌ధానిపై అగ్గి రాజుకున్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: