దేశంలో హాట్ టాపిక్ గా మారిన సంఘటన ఏదైనా ఉందా అంటే అది దిశ అత్యాచారం.. హత్య ఘటన అని చెప్పాలి.  ఈ ఒక్క ఘటన దేశాన్ని, చట్టసభలను అతలాకుతలం చేసింది.  ఎక్కడా లేని విధంగా ప్రజలు రోడ్డుపైకి ఓ ఉద్యమంలా వచ్చారు.  నినాదాలు చేశారు.  అత్యాచారం చేసిన నిందితులను పట్టుకోవాలనిఘోషించారు .  చివరకు ఎట్టకేలకు నిందితులను పోలీసులు పట్టుకోవడం.. విచారిస్తున్న సమయంలో పారిపోయేందుకు ప్రయత్నం చేయడంతో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  


ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు మృతి చెందారు.  ఈ నలుగురు నిందితులలో ఏ 1 గా ఉన్న ఆరిఫ్ డి జక్లర్ గ్రామం.. మిగతా ముగ్గురైనా చెన్నకేశవులు, శివ, నవీన్ లది  పక్కనే ఉన్న గుడిగండ్ల గ్రామం. వేరు వేరు గ్రామాలకు చెందిన వీళ్ళు ఎలా కలిశారు.  వీరి మధ్య స్నేహం ఎలా కుదిరింది.. తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  


నలుగురు నిందితుల్లో ఏ 1 గా ఉన్న ఆరిఫ్ మొదట గుడిగండ్ల శివారులో ఉన్న పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. అక్కడికి తరచుగా ముగ్గురు నిందితులు వస్తుండేవారు. అలా నలుగురి మధ్య స్నేహం ఏర్పడింది.  ఆ తరువాత ఆరిఫ్ బంకు నుంచి బయిటకు వచ్చి లారీ క్లీనర్ గా చేరాడు.  లారీ క్లీనర్ గా చేరిన ఆరిఫ్ అనతికాలంలోనే లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు.  ఆ తరువాత తన స్నేహితులైన నవీన్, చెన్నకేశవులు, శివ లను సహాయకులుగా తీసుకునేవాడు.  


అలా నలుగురు నిందితులను సహాయకులుగా తీసుకొని తరచుగా లారీల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. లారీ ఫీల్డ్ లో ఉన్న ఈ నలుగురికి చెడు అలవాట్లు అబ్బాయి.  తాగుడుకు బానిసలయ్యారు.  డబ్బుల కోసం ఇసుప వస్తువులను దొంగతనం చేసి అమ్ముకున్నారు.  ఈ క్రమంలోనే నవంబర్ 27 వ తేదీ సాయంత్రం తోడుంపల్లి టోల్ ప్లాజా వద్ద మందు తాగుతున్న నలుగురు నిందితులకు దిశ కనిపించడంతో పధకం వేసి వేచి ఉంది అత్యాచారం, హత్య చేశారు.  ఈ ఘటన జరిగిన 10 రోజుల్లోనే నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: