సంచలనంగా మారిన దిశ మర్డర్ కేసులోని  నిందితుల ఏ రోజు ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందేనిందితులైన మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో వెంటనే చనిపోయారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులకు కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో.. గురువారం అర్థరాత్రి దాటాక జైలు నుంచి వీరిని ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.నేరం జరిగిన చోట పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని తొండుపల్లి టోల్‌గేట్ దగ్గరకు గురువారం అర్ధరాత్రి తీసుకెళ్లారు. అక్కడి నుంచి దిశను పెట్రోల్ పోసి కాల్చిన చటాన్‌పల్లి స్థలానికి తీసుకెళ్లారు.

 

ఈ క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కొందరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. నిందితులు రాళ్లు రువ్వినందునే పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది.  ఈవిషయం లోభారత ప్రజలు మొత్తం సంతోషం   వ్యక్తం  చేస్తున్నారు పోలీసులని అభినందిస్తున్నారు ,ఇదే విషయంఫై   నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆనందం వ్యక్తం చేశారు.అదే సమయం లో ముఖ్యమంత్రి ,హోమ్ మినిష్టర్ లపై విరుచుకపడ్డాడు.  

 

రాష్ట్రంలో డమ్మీ హోం మినిస్టర్‌, ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి సరిగ్గా పనిచేయకపోయినా, పోలీసులు తమ బాధ్యతలను  చాల చక్కగా నిర్వర్తించారని పొగిడారు . నిందితులు తప్పించుకునే క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని సీపీ సజ్జనార్ చెబుతోన్న కారణాలను విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.వాళ్లను తిట్టిన వాళ్లలోనేనూ ఉన్నా..
దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం మంచి పరిణామమని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆడ వాళ్లపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడిన వారికి శిక్షలు ఈ స్థాయిలోనే ఉండాలని అన్నారు.ఇలా  శిక్షలు  పడితే నే ఇంకొకరు ఇలాంటి అఘాయిత్యాలు చేయాలంటే భయపడతారు.

 

తెలంగాణ పోలీసులను ఎంతో మంది తిట్టారని, అందులో తాను కూడా ఒకడినని గుర్తు చేశారు. ‘‘నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినందుకు పోలీసులకు ఇదే నా సెల్యూట్.అంటూ  మన పోలీసులను చూసి ప్రతీ రాష్ట్రం లోని పోలీసులు నేర్చుకోవాలి. దేశ వ్యాప్తంగా ఎన్నో ఇలాంటి  రకమైన దారుణాలు జరుగుతున్నాయి. ప్రతి ఘటనలో పోలీసులు ఇలా ముందుకెళ్తే మహిళలపై దౌర్జన్యాలఫై అడ్డుకట్ట వేయవచ్చు అని పేర్కొన్నారు . ఈ ఎన్‌కౌంటర్‌పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విచారణ చేయించాలంటున్నారు. ఇందులో ఏ విచారణ అవసరం లేదు. తెలంగాణ పోలీసులు దేనికీ భయపడక్కర్లేదు. ఎందుకంటే, యావత్ భారతం మీ వెంటే ఉంది.’’ అని రాజాసింగ్‌ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: