హైదరాబాద్ ఘటనతో పాటు ఉన్నావో ఘటనను లోక్ సభ ముక్త కంఠంతో ఖండించింది. ఎంపీలు చట్టాలు కఠినంగా లేకపోవడం వలనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటివి చూస్తూ ఉంటే దేశంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని అన్నారు. వరుస నేరాలతో ఉత్తరప్రదేశ్ అధమప్రదేశ్ గా మారుతుందని అన్నారు. నిందితులు బెయిల్ పై విడుదలయ్యేలా పోలీసులే వ్యవహరించారని, చట్టాలని కఠినతరం చేయాలని ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చేదరి నేత మాట్లాడుతూ హైదరాబాద్, బెంగాల్ లోని మాల్దా, ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. ఉన్నావో అత్యాచార నిందితుడు నాలుగు రోజుల క్రితం బెయిల్ పై విడుదలయ్యాడని అత్యాచార బాధితులికి అతను నిప్పంటించారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ను ఉత్తమ ప్రదేశ్ చేస్తామని అంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రోజురోజుకూ అధమ ప్రదేశ్ గా మారే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 
 
భారతదేశంలో ఏం జరుగుతోంది అని ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన అందరినీ సిగ్గుతో తలవంచుకునేలా చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ లో అత్యాచార నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తే అక్కడి పోలీసులు తూటాలతో కాల్చి చంపారని చెప్పారు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం అత్యాచార నిందితులను బెయిల్ పై విడుదల చేశారని అన్నారు. మరో ఎంపీ అను ప్రియా పటేల్ మాట్లాడుతూ హైదరాబాద్ ఘటన మరవక ముందే ఉన్నావో ఘటన తెరమీదకు వచ్చిందని అన్నారు. 
 
ఉన్నావోలో జరిగిన ఘటన అమానుషం, అమానవీయం అని ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు బాధితురాలిని ఊరి అవతల అడ్డగించి సజీవదహనం చేశాడని అన్నారు. ఈ సమస్య కేవలం ఉత్తరప్రదేశ్, తెలంగాణాది కాదని ఈ సమస్య దేశానిది అని అన్నారు. దేశంలో మూలమూలన ఉన్న నిందితులకు చట్టాలు అంటే భయం లేదని దీనికి చట్టమే బాధ్యత వహించాలని అన్నారు. నిర్భయ కేసులో దోషులకు మరణ దండన విధించినా అమలు కావడం లేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: