ప్రపంచ మార్కెట్లో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రిటైల్ వ్యాపారంపై దాని ప్రభావం అంతగా లేదని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. హైదరాబాదులో ఉన్న వాల్‌మార్ట్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు. తమ బెస్ట్ ప్రైస్ కేంద్రాలను ఇంకా పెంచడం ద్వారా తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

భారత దేశంలో పదేళ్ల క్రితం తమ వ్యాపారాన్ని ప్రారంభించిన వాల్ మార్ట్ బెస్ట్ ప్రైస్ ఈ రోజు 27 స్టోర్లు తో కొనసాగుతుంది. గడిచిన 13 నెలల్లో వివిధ పట్టణాల్లో 7 కొత్త స్టోర్లు ఈ సంస్థ ప్రారంభించింది. త్వరలో దేశంలో 50 బెస్ట్ ప్రైస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో వచ్చే వారం కొత్త స్టోర్ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అతి త్వరలోనే తిరుపతిలోను బెస్ట్ ప్రైస్ స్టోర్ రానుంది అని చెప్పారు.

 

ఈ సందర్భంగా క్రిష్ అయ్యర్ మాట్లాడుతూ.. దేశీయ రిటైల్ వ్యాపారం 2027 నాటికి  1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇతర రంగాల పరిస్థితి గురించి తమకు అవసరం లేదని, కానీ కస్టమర్లు తమ వద్దకు కొనేందుకు వస్తున్నారని, కేంద్రం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కేసీఆర్, జగన్ ప్రభుత్వాల నుంచి అవసరమైన లైసెన్స్ వంటివి ఎలాంటి ఇబ్బంది లేకుండా పొంద కలుగుతున్నామన్నారు .


 ప్రపంచ మార్కెట్లో భారత్ అన్ని విభాగాల్లో దూసుకుపోతోందన్నారు ఆయన. కాగా, ఫ్లిప్‌కార్టులో వాల్‌మార్ట్ పెట్టుబడులు పెట్టినప్పటికీ అది పూర్తి స్వతంత్రంగానే కొనసాగుతుందని క్రిష్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ బృందమే దానిని నిర్వహిస్తోందన్నారు అని ఆయన చెప్పారు .2022 నాటికి మరిన్ని స్టోర్స్ కోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది వాల్ మార్ట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: