క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇప్పటి వరకూ చంద్రబాబునాయుడు దగ్గర ప్యాకేజి తీసుకునే పవన్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా బిజెపితో కూడా ఇదే విధమైన ఒప్పందం జరిగిందని సమాచారం.

 

పవన్ ఈమధ్యనే ఢిల్లీకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. బిజెపి జాతీయ అధక్షుడు, కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా తో భేటి కోసమే ఢిల్లీకి వెళ్ళినట్లు ప్రచారం జరిగింది. రెండు రోజుల పాటు   ఢిల్లీలోనే ఉన్న పవన్ తిరిగి వచ్చేశారు. అమిత్ ను కలవకుండానే వెనక్కు తిరిగి వచ్చేసినట్లు అన్నారు. అయితే తాజా సమాచారం ఏమిటంటే మీడియాకు కూడా ఉప్పందకుండానే  అమిత్-పవన్ మధ్య రహస్య సమావేశం జరిగిందట.

 

ఆ సమావేశంలో జరిగిన ఒప్పందం ప్రకారమే రాష్ట్రానికి పవన్ తిరిగి రాగానే జగన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ అయినదానికి కానిదానికి ఊగిపోతు  జగన్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన రేప్, హత్య కేసులో జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  తెలంగాణాలో దిశపై హత్యాచారం జరిగితే జనాలు 151 సీట్లు ఇచ్చింది ఎందుకు ? అంటూ జగన్ పై మండిపడుతున్నారు.  2017లో అధికారంలో ఉన్నది చంద్రబాబు. తెలంగాణాలో జరిగిన ఘటనకు సమాధానం చెప్పాల్సింది కేసియార్ అన్న విషయం అందరికీ తెలుసు.

 

జగన్ కు పై ఘటనలకు ఎటువంటి సంబంధం లేకపోయినా  రెండింటిని జగన్ కు ముడేసి మాట్లాడుతున్నారంటే పవన్ కు బాగానే ప్యాకేజి ముట్టిందనే అర్ధమైపోతోంది. ఢిల్లీలో అమిత్ తో భేటి తర్వాతే జగన్ పై పవన్ ఒక్కసారిగా జోరు పెంచారు. అంటే పవన్ వెనుక కచ్చితంగా బిజెపినే ఉందని అందరికీ అర్ధమైపోతోంది. అందుకనే ఇప్పటి వరకూ చంద్రబాబు దగ్గర తీసుకుంటున్న ప్యాకేజికి అదనంగా బిజెపి నుండి కూడా మరో ప్యాకేజి ముడుతోందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: