మద్యపాన నిషేధం అనేది ప్రజలకు ఎంత అవసరం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... ప్రజల జీవన ప్రమాణాలను మద్యపానం అనేది నాశనం చేస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. రోజు వంద రూపాయల ఆదాయం ఉన్న వాడు... 90 రూపాయల వరకు మద్యానికి ఖర్చు చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి యువత ఎక్కువగా బానిస అవుతుంది. చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు రోజు అంతా పని చేసి సాయంత్రానికి తాగి పడుకోవడంతో మహిళలపై ప్రభావం చూపిస్తుంది అనే విషయం అందరికి తెలుసు.

 

ఈ నేపధ్యంలో ప్రజల పరిస్థితులు చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్... విపక్షంలో ఉన్న సమయంలో మద్యపాన నిషేధం మీద అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు దశల వారీగా మద్యపాన నిషేధ౦ అనేది రాష్ట్రంలో అమలు అవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. దీనితో వాటి సంఖ్య భారీగా తగ్గింది. అదే విధంగా మద్యం ధరలను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. ఆదాయం కోసం అని విపక్షాలు ఆరోపిస్తున్నా దీని వలన ప్రజలకు లాభాలే ఎక్కువగా ఉన్నాయి అనేది వాస్తవం.

 

రోజు మద్యపానం అలవాటు ఉన్న వాడు ఇప్పుడు ధరలు పెరగడంతో రెండు రోజులకు ఒకసారి మద్యం తాగే పరిస్థితి జగన్ తీసుకొచ్చారు. ఇక బార్ల సంఖ్య కూడా క్రమంగా రాష్ట్రంలో తగ్గుతుంది. దీని ప్రభావంతో ప్రజలకు మద్యం దూరం అయ్యే అవకాశం ఉంది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మధ్యం రాష్ట్రంలోకి వస్తుందని గమనించి దానికి అడ్డుకట్ట వేసారు ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు మద్యం కార్డులు ఇస్తున్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో మద్యం తాగే వారి సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మద్యపాన నిషేధం విషయంలో ఒక్క మాటలో చెప్పాలి అంటే... జగన్ హీరో అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: