ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడటానికి గాను చంద్రబాబు అన్ని జిల్లాల్లో పర్యటనలు నిర్వహించారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ పర్యటనలు పూర్తి అయ్యాయి. కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం వర్గ విభేదాలను స్వయంగా పరిష్కరించడం వంటివి చూసాం... ఇక నాయకుల అభిప్రాయాలను కూడా చంద్రబాబు ఎక్కువగానే తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి గాను అవసరమైన సలహాలను నేతల వద్ద చంద్రబాబు తీసుకుని ఇక నుంచి కార్యకర్తలకు తాను అధిక ప్రాధాన్యత ఇస్తాను అని స్పష్టం చేసారు.

 

ఈ నేపధ్యంలో ఆయనకు రాయలసీమ జిల్లాల నుంచి ఊహించని విధంగా షాకులు వచ్చాయట. ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న కీలక నేతల్లో ఎక్కువగా మంది కోవర్టులే అనే సమాచారం చంద్రబాబుకి వచ్చింది. కార్యకర్తల్లో కావాలనే చిచ్చు పెడుతున్నారని, ఇతర పార్టీలకు సహకరిస్తున్నారని, వైసీపీ నేతలకు వాళ్ళు సహకరిస్తున్నారు అనే విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. కొంత మంది నేతలు వైఎస్ మీద అభిమానంతో ఇప్పటికి వైసీపీకి సహకరిస్తున్నారని, కాని పనుల కోసమే వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారని చంద్రబాబుకి ఒక స్పష్టత వచ్చింది.

 

దీనితో ఇప్పుడు చంద్రబాబు ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో అర్ధం కాక తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడా లేని విధంగా చంద్రబాబు ముందే నేతలు కొట్టుకున్నారు. చంద్రబాబు వద్దని వారిస్తున్నా ఎవరూ ఆగలేదు. అస‌లు బాబును ఇప్పుడు పార్టీలోనే ద్వితీయ శ్రేణి నేతుల సైతం ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. సీమ జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి ఘోరంగా ఉండడంతో బాబు ను సైతం వాళ్లు డోన్ట్ కేర్ అంటున్నారు.

 

ఇదే పరిస్థితి కొనసాగితే తన సొంత ప్రాంతంలోనే పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన చంద్రబాబులో వ్యక్తమవుతుంది. ఎన్ని చేసినా సరే నాయకులకు త్రుప్తి ఉండటం లేదని కష్టాల్లో ఉన్న సమయంలో కూడా ఈ వైఖరి ఏంటి అంటూ చంద్రబాబు అసహనంగా ఉన్నారట. ఇక కొందరిని బాధ్యతల నుంచి తప్పిస్తే మంచిది అని భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: