ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వ్యక్తి కోసం ఢిల్లీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారంటే అతను ఎంత ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి ? నిజమే ఆ వ్యక్తి సీఎం జగన్ కు ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ఎంతముఖ్యమైన వ్యక్తి అంటే ఆ వైఎస్ కుటుంబంతో దాదాపు 30 సంవత్సరాల పైనే అతనితో ఆయనకు అనుబంధం ఉంది. 

                        

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ జగన్ కు వ్యక్తిగత సహాయకుడు అయిన నారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ శుక్రవారం ఈరోజు మృతి చెందారు. ఎంతోకాలంగా తన వెంటే ఉంటున్న నారాయణ మరణవార్త విన్న జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 

                       

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న సీఎం జగన్ నారాయణ మరణ విని తక్షణం పర్యటన రద్దు చేసుకుని మరి నారాయణ స్వస్థలం అనంతపురం జిల్లా దిగువపల్లెకు బయల్దేరారు. ఇక సీఎం జగన్.. ఆయన సతీమణి భారతి శుక్రవారం మధ్యాహ్నం దిగువపల్లె చేరుకున్నారు. 

                              

నారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నారాయణ కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన వ్యక్తిగత సహాయకుడి మరణవార్త విని సీఎం ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని రావడం విశేషం. కాగా నారాయణ సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవారు, జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలోనూ నారాయణ జగన్ వెంటే ఉన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: