ఇటీవల కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతం పై సర్వత్రా నిరసనలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ఆ కేసులో నలుగురు నిందితులు కలిసి ఆమెను ఎంతో కిరాతకంగా ఈడ్చికెళ్లి రేప్ చేయడంతో పాటు ఆమెను ఘోరంగా హింసించి ఆపై మర్డర్ చేసి కాల్చి బూడిద చేసారు. కాగా ఆ దారుణ ఘటనపై ప్రజా సంఘాలు మరియు మహిళా సంఘాలతో పాటు పలువురు సినిమా మరియు రాజకీయ నాయకులు సైతం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 

 

ఇక నిన్న ఆ నలుగురిని కేసు రీ కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రియాంకను కాల్చి వేసిన చోటికి తీసుకువెళ్లిన పోలీసులు, సడన్ గా ఆ నలుగురు తమపై రాళ్ల దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఎన్కౌంటర్ చేయడం జరిగిందని చెప్పారు. అయితే ఈ ఎన్కౌంటర్ ఘటనపై పూర్తి వివరాలు నిన్న మధ్యాహ్నం సైబరాబాద్ ఎస్పీ సజ్జనార్ వివరించడం జరిగింది. నిజానికి నిందితుల్లో ఆరిఫ్ మరియు చెన్నకేశవులు ఇద్దరూ కూడా తమ వద్దనున్న ఆయుధాలలో రెండిటిని దొంగిలించి తమ వద్ద కనపడకుండా వ్యాన్ లో వస్తున్న సమయంలో దాచి ఉంచారని, 

 

అయితే వ్యాన్ దిగిన తరువాత హఠాత్తుగా ఆ ఆయుధాలతో పాటు చుట్టుప్రక్కల ఉన్న రాళ్లతో మొత్తం నలుగురు కూడా పారిపోయేదుకు ప్రయత్నించి దాడి చేయడం జరిగిందని, కాగా ఆ ఘటనలో ఒక ఎస్సై మరియు ఒక కానిస్టేబుల్ కు కూడా బాగా గాయాలయ్యాయని, అయితే అదే సమయంలో వారిపై కొన్ని రౌండ్లు కాల్పులు జరుపగా, ఆ నలుగురికి గుళ్ళు తగిలి అక్కడికక్కడే మరణించారని చెప్పడం జరిగింది. ఇక ఈ ఘటనలో గాయాలపాలయిన పోలీసులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని అన్నారు. ఇక వారి ఎన్కౌంటర్ తో దేశవ్యాప్తంగా ఎస్పీ సజ్జనార్ సహా తెలంగాణ పొలిసు వారిపై ప్రశంసలు కురవడంతో పాటు, పోలీసులు అంటే గౌరవం పెరిగిందని, ఈ తాజా ఘటనతో ప్రియాంక ఆత్మ శాంతించడం ఖాయం అని పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: