ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ని లక్ష్యంగా చేసుకోవడానికి గాను మత రాజకీయం అనేది విపక్షాలు చేస్తున్నాయి అనే విషయం ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది. రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు... సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో కొందరికి మత ప్రచారం ఏ విధంగా కనపడిందో తెలియదు గాని మత ప్రచారం కోసమే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ఇక ప్రతీ దానిలో మతప్రచారం అంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళారు.

 

త‌న‌కు గుర్తు వచ్చినప్పుడు రాజకీయాల మీద దృష్టి పెట్టె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చిత్తూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి మత ప్రచారం చేస్తున్నారు అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పుడు ఈ ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకునే పార్లమెంట్ సమావేశాల అనంతరం విపక్ష తెలుగుదేశం అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు... పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్నారు. వీరి ముగ్గురికి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో మంచి సంబంధాలు ఉన్నాయి.

 

ఆయన మహారాష్ట్ర నాగపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో... నాగపూర్ లో బిజెపి మాతృసంస్థ... ఆర్ ఎస్ ఎస్ ఉండటంతో ఆయన ద్వారా మోహన్ భగవత్ కి రాష్ట్రంలో మత ప్రచారం జరుగుతుంద‌ని ఫిర్యాదు చేసే ఆలోచనలో తెలుగుదేశం ఎంపీలు ఉన్నారట. అటు ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని కొంద‌రు వేగుల ద్వారా ఆర్ ఎస్ ఎస్ కు చేర‌వేశారు. ఇప్పుడు టీడీపీ ఎంపీలు ఈ విష‌యాన్ని మ‌రింతగా ఆర్ఎస్ఎస్‌కు ఎగ‌దోయాల‌ని చూస్తున్న‌ట్టు భోగ‌ట్టా..!

 

చంద్రబాబు ఈ మేరకు సుజనా చౌదరి ద్వారా లైన్ క్లియర్ చేసారని, అందుకే కేసినేని నాని పదే పదే ఢిల్లీలో నితిన్ గడ్కరిని కలుస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి, జగన్ ని ఎదుర్కోవడానికి అప్పులు, ఇసుక, రాజధాని, అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మత ప్రచారం మీద దృష్టి పెట్టింది తెలుగుదేశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: