దిశ హత్యాచారం కేసు.. ఈ కేసు గురించి ప్రతిఒక్కరికి కాదు దేశం మొత్తం తెలుసు. అతికిరాతకంగా ఒక వెటర్నరీ వైద్యురాలు దిశను అన్యాయంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమె శరీరంపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కనీసం ఆమె శవం కూడా దొరకకుండా ఒక ఆడపిల్లను అతికిరాతకంగా చంపినా ఘటనలో నిందితులు నిజం ఒప్పుకోగా ఆ నిందితులను రిమాండ్ లో ఉంచారు. 

 

అయితే నిన్న అర్ధరాత్రి అదే ఘటన స్థలంలో ఆ ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు.

 

ఆ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అందిన వినతిపత్రంపై అత్యవసరంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తి నివాసంలో విచారణ చేపట్టారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆరిఫ్, నవీన్‌, శివ, చెన్నకేశవుల మృతదేహాలను ఈనెల 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. 

 

హైకోర్టులో విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. శవపరీక్ష ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసినట్లు కోర్టుకు తెలిపారు. గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ నిపుణుల బృందంతో శవపరీక్ష జరిగిందని అయన వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై ఈనెల 9వ తేదీ ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 

 

శవపరీక్ష వీడియోను మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జికి అప్పగించాలని, ఆ వీడియో సీడీని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జి వారికీ అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది. మరో వైపు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలో నిందితుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తయింది. దీంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాల భద్ర పరచడానికి సదుపాయాలు లేకపోవడంతో హైదరాబాద్ కి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: