దిశ హత్యాచారం కేసు.. ఈ కేసు గురించి ప్రతిఒక్కరికి కాదు దేశం మొత్తం తెలుసు. అతికిరాతకంగా ఒక వెటర్నరీ వైద్యురాలు దిశను అన్యాయంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమె శరీరంపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కనీసం ఆమె శవం కూడా దొరకకుండా ఒక ఆడపిల్లను అతికిరాతకంగా చంపినా ఘటనలో నిందితులు నిజం ఒప్పుకోగా ఆ నిందితులను రిమాండ్ లో ఉంచారు. 

 

అయితే నిన్న అర్ధరాత్రి అదే ఘటన స్థలంలో ఆ ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు.

 

అయితే ఈ ఎన్కౌంటర్ పై దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుంటే.. నిందితుల కుటుంబాలు మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. దీంతో వారు ఆందోళనకు దిగారు. అయితే వారి కుటుంబాలు అన్ని బడుగుబాళిహైనా వర్గాలకు చెందిన కుటుంబాలు.. చూడగానే అయ్యో పాపం అని అనిపించే కుటుంబాలు.. 

 

కానీ ఎం చేస్తాం.. అలాంటి కుటుంబంలో పుట్టినవాడు కష్టపడి పైకి రావాలి అనుకోవాలి కానీ ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మరో అమ్మాయిపై అతికిరాతకంగా అత్యాచారం చేసి హత్య చెయ్యకూడదు. అది చాలా దారుణమైన ఘటన.. చెప్పలేని ఘటన.. ఇలాంటి నీచులను చంపి పడేయాలి.. అప్పుడే మరికొందరు అయినా ఆలా చేయాలంటే బయపడుతారు. 

 

నిజమే అమ్మ.. నీ భర్తను చంపేశారు.. కాని నీ భర్త ఓ అమాయికురాలిని అన్యాయంగా చంపేశాడు. అలాంటి నీచుడు చచ్చినందుకు ఆనందించు మరో జీవితాన్ని ప్రారంభించు.. ఎందుకంటే నువ్వు కనీసం బతుకున్నావు కానీ నీ భర్త అభంశుభం తెలియని ఆడపిల్ల అన్యాయంగా చనిపోయింది. అది గమనించు తల్లి. 

మరింత సమాచారం తెలుసుకోండి: