తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న దిశ అత్యాచారం, హత్య ఘటనకు ఈ రోజు ఓ ముగింపు పలికారు తెలంగాణ పోలీసులు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నింధితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు వాళ్లు తిరగబడటం తో ఎన్‌ కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ సంఘటనపై యావత్‌ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది..అయితే, ఇప్పుడు ఆ నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌ కౌంటర్ చేసి హతమార్చడంపై శ్రీరెడ్డి చాలా హ్యాపీగా ఉన్నారు.

 

నాలో ఉన్న స్త్రీ భావం, స్త్రీ తత్వం ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎందుకు ఇంత సంతో షంగా ఉన్నానో వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదు. ఈరోజు ఒక అమ్మవారు శాంతించి నట్టు ఉంది. అంటే, మా స్త్రీ జాతికి నలుగురి ని బలిచ్చారు. మాలో ఉన్న దేవతకి.. మమ్మల్ని కూడా ఇలానే చంపేస్తారా, మన పిల్లల్ని కూడా ఇలా చంపేస్తారా అని బిక్కు బిక్కుమంటూ భయపడుతోన్న ఆడజాతికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తో పాటు పోలీస్ శాఖ ఇచ్చిన ఈ గిఫ్ట్అమ్మాయి మరిచిపోలేనిది’’ అని శ్రీరెడ్డి అన్నారు. పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు..

 


వారు ఎంతో చాక చ్యంగా ప్రవర్తించడం అందరికీ ఆనందాన్ని మిగిల్చింది.. మేం తొడగొట్టి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఇది ఎంత గర్వించదగిన విషయం అయినప్పటికీ ఆడపిల్లలు వారి జాగ్రత్తలో వారు ఉండాలి’’ అని సూచించారు శ్రీరెడ్డి. ఏ మత గ్రంథమైనా మహిళలను గౌరవించండి అనే చెప్తుందని.. హింసించమని చెప్పలేదని అన్నారు. ఆఖరికి విడాకులు తీసుకోమని కూడా ఏ గ్రంథం చెప్పలేదన్నారు... ఈ ఘటనను చూసి అయిన పది మంది మగాళ్లు బుద్ది తెచ్చుకుంటారు అని శ్రీరెడ్డి అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: